Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ చేసే చిన్న చిన్న తప్పులు, వాళ్లు అనే చిన్న చిన్న మాటలే ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కోపంలో ఉన్నప్పుడు ఎవరు ఎంత బ్యాలెన్స్‌గా ఉన్నారు అనే విషయాన్ని ఆడియన్స్ ఎక్కువగా గమనిస్తారు. ఇక గతవారం జరిగిన ఫన్ టాస్కులలో దాదాపు అందరు కంటెస్టెంట్స్ తమ బ్యాలెన్స్ కోల్పోయారు. చిన్నగా మొదలయిన గొడవలన్నీ పెద్ద వాగ్వాదాలతోనే ముగిశాయి. అలాగే శోభా, యావర్‌ల మధ్య కూడా గొడవ జరిగింది. అంతే కాకుండా ఈవారం వారిద్దరి ప్రవర్తన కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అదే విషయం వారితో మాట్లాడడానికి వారిద్దరి సెపరేట్‌గా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున.


కన్నీళ్లు పెట్టుకున్న శోభా..
ముందుగా శోభాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఒక వీడియో చూపించారు నాగ్. అందులో ఈ శనివారం నాగ్ సార్‌తో అన్ని చెప్తాను లేకపోతే నా పేరు శోభా శెట్టినే కాదు అని శోభా చెప్పింది. అయితే నీ పేరు శోభానే.. చెప్పు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అని నాగార్జున అడిగారు. శివాజీ.. తనను ముందు నుండే టార్గెట్ చేస్తున్నారని, ప్రతీ విషయంలో ఫేవరిజం అన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పింది. అమర్‌దీప్, ప్రియాంక, శోభా.. ఇలా ముగ్గురు ఉన్నప్పుడు ఏదో ఒకటి కావాలని అంటున్నారని బయటపెట్టింది. అంతే కాకుండా అసలు ఎందుకిలా మాట్లాడుతున్నారని తను శివాజీతో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆయనే స్పందించలేదని కంప్లయింట్ చేసింది. శోభా సంచలకురాలిగా ఉన్నప్పుడు బాల్స్ గేమ్‌లో జరిగిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. ప్రియాంకకే సపోర్ట్ చేస్తూ తను అరవడం వల్లే శివాజీతో గొడవ మొదలయ్యిందని క్లారిటీ ఇచ్చారు.


అయితే తనకు తనకు ప్రియాంకకు సపోర్ట్ చేయాలనిపించే చేశానని శోభా సూటిగా చెప్పింది. అది తప్పే అని నాగార్జున ఖండించారు. ఆ తర్వాత యావర్ విషయంలో కూడా తను తప్పు చేసిందని మరొక వీడియో చూపించారు. ‘‘నీ వల్ల హౌజ్ వాతావరణమే మారిపోతుంది. నువ్వు అందరినీ కావాలని రెచ్చగొడుతున్నావు. నీ గేమ్ డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అందరి గేమ్‌ను డిస్టర్బ్ చేస్తున్నావు’’ అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. దీంతో శోభా ఏడవడం మొదలుపెట్టింది. తాను హౌజ్ నుండి వెళ్లిపోతానేమో అన్న భయంతో ఒత్తిడి ఎక్కువయిపోతుందని బాధపడింది. శోభా బాధ చూసిన నాగార్జున స్ట్రాంగ్‌గా ఉండమని ధైర్యం చెప్పారు.


శోభాదే తప్పు అన్న యావర్..
శోభా తర్వాత యావర్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున. బాల్స్ గేమ్‌లో శోభాతో ‘ఛీ, తూ’ అన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే శోభా తనను ముందుగా రెచ్చగొట్టిందని అందుకే అలా అన్నానని తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు యావర్. శోభా అలా అనొద్దు అంటున్న కూడా నువ్వు పదేపదే అంటూ ఉన్నావని గుర్తుచేశారు నాగార్జున. అయితే అబ్బాయిలయితే తాను సీరియస్‌గా హ్యాండిల్ చేసేవాడిని అని, అమ్మాయి కాబట్టి సున్నితంగా హ్యాండిల్ చేసినా.. శోభానే తనను రెచ్చగొట్టిందని యావర్ అన్నాడు. అంటే అబ్బాయిలను అయితే కొట్టేస్తావా అని నాగార్జున అడగగా.. తన ఉద్దేశం అది కాదని క్లారిటీ ఇచ్చాడు యావర్. తన ప్రవర్తన కరెక్ట్‌గా లేదు కాబట్టి వెళ్లి శోభాకు సారీ చెప్పమన్నారు నాగార్జున. శోభా రెచ్చగొట్టడం వల్లే తను అలా ప్రవర్తించానని, తనకు సారీ చెప్పడం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ‘‘నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనిపిస్తేనే చెప్పు లేకపోతే నీ ఇష్టం’’ అన్నారు నాగార్జున. దీంతో కన్ఫెషన్ రూమ్‌ నుండి బయటికి వచ్చిన వెంటనే శోభా చేయి పట్టుకొని సారీ చెప్పాడు యావర్. శోభా కూడా తిరిగి సారీ చెప్పింది.


Also Read: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!