Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయ్యారు. వారే పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, యావర్. అయితే వీరందరిలో ఎవరు గెలుస్తారు అని తెలుసుకోవడం కోసం వారి కుటుంబ సభ్యులు కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. వారి ఫ్యామిలీ.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినందుకు వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి బయటపెట్టారు. అంతే కాకుండా శివాజీ కొడుకు రిక్కీ సైతం ఒక సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్‌ గురించి శివాజీ దగ్గర రివీల్ చేశారు నాగార్జున.


వాళ్లు ఎగ్జామ్ రాస్తే మాకు టెన్షన్‌గా ఉంది: అర్జున్ భార్య


ముందుగా అర్జున్ భార్య సురేఖను పలకరించారు నాగార్జున. తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు. వారిద్దరు మొదటిసారి ఎప్పుడు కలిశారు అని అడగగా.. డిసెంబర్ 14 అని సమాధానిమచ్చింది సురేఖ. అంటే ఇప్పటికీ ఏడేళ్లు అయిపోయింది అని తెలిపింది. ఎవరు విన్నర్ అవుతారు అని ప్రశ్నించగా.. గెస్ చేయలేనని, వాళ్లు ఎగ్జామ్ రాస్తే మాకు టెన్షన్‌గా ఉందంటూ అర్జున్‌లాగానే మాట్లాడింది.


రైతుల గురించి లక్షలాది మందికి తెలుస్తుంది: పల్లవి ప్రశాంత్ తండ్రి


ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రిని పలకరించారు నాగార్జున. వాళ్లని చూడడానికి జనాలు వస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే ఎక్కడెక్కడి నుండో వస్తున్నారని, బెంగుళూరు నుండి కూడా వారిని చూడడానికి వస్తున్నారని ఆయన తెలిపారు. వారిని పొలం దగ్గరకు వెళ్లనివ్వడం లేదని, పని చేసుకోనివ్వడం లేదని, ఎప్పుడూ ఎవరో ఒకరు చూడడానికి వస్తున్నారని అన్నారు. పని చేసుకోనివ్వకపోయినా పర్వాలేదని, బిగ్ బాస్‌తో తమకు గొప్ప పేరు వచ్చిందని, ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకునేవారి గురించి ఇప్పుడు లక్షల మందికి తెలుస్తుందని సంతోషంగా చెప్పారు.


చాలా గర్వంగా ఉంది: అమర్ దీప్ తల్లి


అమర్‌దీప్ తల్లి రూపాను కూడా నాగార్జున పలకరించారు. తన కొడుకును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని రూపా తెలిపారు. కచ్చితంగా అమరే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్‌లాంటి పెద్ద స్టేజ్‌లో తను కంటెస్టెంట్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అయితే అమర్‌తో ఏమైనా హాలీడే ప్లాన్ చేస్తున్నావా అని తేజస్వినిని అడిగారు నాగార్జున. వచ్చాక ప్లాన్ చేయాలని చెప్పింది తేజూ.


ప్రియాంక దగ్గర ఏడ్చారు, ఉండిపోయాను: శివాజీ పెద్ద కొడుకు


యావర్ అన్న కూడా ఫైనల్స్ వరకు తన తమ్ముడు చేరుకోవడం గురించి సంతోషం వ్యక్తం చేశాడు. చాలా గర్వంగా ఉందన్నాడు. నాగార్జున.. యావర్‌తో మాట్లాడడం అనేది వారికి ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపాడు. ఆ తర్వాత శివాజీ కొడుకులను పలకరించారు నాగ్. శివాజీ పెద్ద కొడుకును ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉండాల్సింది కదా అని అడిగారు. ‘‘9న వెళ్లాల్సింది కానీ నాన్న ప్రియాంకతో కూర్చొని ఏడ్చారు. సమయం గడపలేకపోతున్నాని బాధపడ్డారు. అందుకే ఉండిపోయాను. త్వరలోనే వెళ్తాను’’ అని సమాధానిమిచ్చాడు.


కావాలనే నాన్నను అలా అన్నాను: శివాజీ చిన్న కొడుకు


ఇక శివాజీ బిగ్ బాస్‌లోకి రావడానికి కారణమయిన రిక్కీతో కూడా నాగ్ మాట్లాడారు. అప్పుడే రిక్కీ.. అందరికీ ఒక సీక్రెట్ చెప్తానని అసలు విషయం చెప్పాడు. ‘‘3 నెలల క్రితం బిగ్ బాస్ ఆఫర్ గురించి ముందుగా నాన్న నాతోనే చెప్పారు. ఒకవేళ అమ్మ, అన్నయ్య ఒప్పుకున్నా కూడా నేను వద్దంటే నాన్న ఆగిపోయేవాడు. అందుకే అలా జరగకూడదని నువ్వు వెళ్లి ఏం ఆడతావులే అని ఛాలెంజ్ చేశాను’’ అని అసలు విషయాన్ని బయటపెట్టాడు. రిక్కీ ప్లే చేసిన రివర్స్ సైకాలజీ చూసి నాగార్జున ముచ్చటపడ్డారు. అదే విషయాన్ని శివాజీకి చెప్పారు.


Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?