Bigg Boss 7 Telugu luck for Tasty Teja: 'బిగ్ బాస్' ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రియాలిటీ షో ద్వారా వాళ్ళకు ఉపయోగం ఉంటుందా? లేదా? అనే అంశంలో చర్చ జరుగుతోంది. 'బిగ్ బాస్' వాళ్ళ ఉపయోగం ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాంతో ఎవరికీ పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొంటున్న జనాలు సైతం మన తెలుగులో ఉన్నారు. ఎవరెవరి సంగతి ఏంటి? అనేది పక్కన పెడితే... 'బిగ్ బాస్' వల్ల తనకు మేలు జరిగిందని టేస్టీ తేజ తెలిపారు. 


15 సినిమాల్లో అవకాశాలు వచ్చాయ్!
Tasty Teja gets acting offers in 15 movies: 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్ళక ముందు నుంచి తెలుగు బుల్లితెర వీక్షకులకు టేస్టీ తేజ తెలుసు. కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్' స్కిట్స్ ద్వారా ఆయన ఎంతో మందిని నవ్వించారు. అంతే కాదు... తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమా ప్రేక్షకులకు సైతం దగ్గర అయ్యారు. సినిమాల విడుదలకు ముందు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయ్యారు. అయితే... 'బిగ్ బాస్' వల్ల మరింత ఎక్కువ మందికి దగ్గర అయ్యారు.


Also Readప్రజల ‘పల్లవి’ - ప్రశాంత్.. ప్లస్, మైనస్‌లు ఇవే, గురూజీని ముంచేస్తాడా?


'బిగ్ బాస్' హౌస్ / షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత తనకు 15 సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఫినాలేలో కింగ్ అక్కినేని నాగార్జునతో టేస్టీ తేజ చెప్పారు. ఇంతకు ముందు చిన్నా చితకా సినిమాల్లో ఆయన కనిపించారు. అయితే... ఈసారి కాస్త నిడివి ఉన్న పాత్రలు వచ్చి ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. 


సినిమాల్లో సక్సెస్ కొట్టిన 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు ఎక్కడ?
'బిగ్ బాస్' షో ద్వారా వచ్చిన క్రేజ్ సినిమాలకు పనికి రాదని మొదటి నుంచి కొంత మంది విమర్శలు చేస్తూ వస్తున్నారు. శివ బాలాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, అభిజీత్ వంటి హీరోలు 'బిగ్ బాస్' ఇంటిలో వెళ్ళడానికి ముందు హీరోలుగా సినిమాలు చేశారు. ఆ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేశారు. అందువల్ల, వాళ్ళను కౌంట్ చేయడం లేదు కొందరు.


Also Readవిన్నర్ రేసులో అమర్‌దీప్ - ప్లస్ మైనస్‌లు ఇవే, కలిసొచ్చిన అమాయకత్వం!


'బిగ్ బాస్'కు రావడం వల్ల లాభపడినది ఎవరైనా ఉన్నారా? అని చూస్తే... తెలుగు అమ్మాయి దివి వడ్త్యా కనిపిస్తారు. 'బిగ్ బాస్' స్టేజి మీద నుంచి మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆమెకు ప్రామిస్ చేశారు. ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు కూడా! 'గాడ్ ఫాదర్' సినిమాలో దివి ఓ పాత్రలో కనిపించారు. 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్ళడానికి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో ఆమె ఓ రోల్ చేసినప్పటికీ... ఎవరూ పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. షో నుంచి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని చిన్న సినిమాలు ఆమె చేశారు.


Also Readవారేవ్వా, యావర్ - జీరోగా వచ్చి.. హీరో అయ్యాడు, ఆ ఇద్దరి వల్లే ట్రోఫీ దూరం?