Pallavi Prashanth: ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అన్నింటిలో పలువురు కంటెస్టెంట్స్ కామన్‌మ్యాన్‌లా ఎంటర్ అయ్యారు. కానీ వారిలో ఎవరూ తగినంత గుర్తింపు సంపాదించుకోలేదు. పైగా బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఎక్కువకాలం ఉండలేకపోయారు. కానీ మొదటిసారి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వబోతున్నాడు. తను మరెవరో కాదు.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ సీజన్ 7కు విన్నర్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమయితే.. తనలాగా బిగ్ బాస్ కలలు కనే ఎంతోమంది కామన్ పీపుల్‌కు ప్రశాంత్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అసలు తన కథేంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
రైతుబిడ్డ.. మళ్లొచ్చినా..
తెలంగాణలో వ్యవసాయమే జీవన ఆధారంగా జీవించే ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. ముందుగా తను ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి తన డైలీ లైఫ్ గురించి, తన ఊరి విశేషాల గురించి, తన పని గురించి రొటీన్‌గా వీడియోలు చేస్తూ ఉండేవాడు. అలా మెల్లగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయ్యాడు. అప్పటివరకు తనకు ఉన్న యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ అందరూ తన ఫాలోవర్స్‌గా మారారు. దీంతో 555కే ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయాడు. ‘అన్నా.. రైతుబిడ్డని అన్నా.. మళ్లొచ్చినా’ అంటూ వీడియో మొదలవ్వగానే తన ఫాలోవర్స్‌ను పలకరించేవాడు ప్రశాంత్. ఇక అదే డైలాగ్‌తో ఫేమస్ కూడా అయ్యాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చినప్పుడల్లా ఈ డైలాగ్‌ను ఉపయోగించేవాడు.
స్టూడియో చుట్టూ తిరిగాడు..
బిగ్ బాస్ అనే రియాలిటీ షో ప్రారంభం అయినప్పటి నుండి తనకు కూడా ఆ షోపై ఆసక్తి పెరిగింది. మామూలుగా బిగ్ బాస్‌పై రివ్యూలు ఇస్తూ.. వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. తనకు ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అవకాశం దొరుకుతుందేమో అని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు కూడా చాలాసార్లు వచ్చివెళ్లేవాడు. కానీ అవకాశం రాలేదు. దీంతో తనకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ సాయం తీసుకున్నాడు. తాను చేసే బిగ్ బాస్ రీల్స్‌ను, వీడియోలను వైరల్ చేసి.. ఎలాగైనా తనను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా చేయమని ఫాలోవర్స్‌ను కోరాడు. చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్తూ తన వీడియోల్లో ప్రశాంత్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అలా తన బిగ్ బాస్ వీడియోలు వైరల్ అయ్యి.. బిగ్ బాస్ నుండి తనకు పిలుపు వచ్చింది.
నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా..
‘రైతుబిడ్డ’ అనే ట్యాగ్‌తోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక సందర్భంలో తనకు వచ్చే డబ్బును నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా అని పల్లవి ప్రశాంత్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తన ప్రవర్తనకు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం తనకు 952కే వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ ఫాలోవర్స్ అంతా తనను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయాలని తెగ ఓట్లు వేసి ఓటింగ్ విషయంలో తనను మొదటి స్థానంలో నిలబెట్టారు.
Also Read: ప్రజల ‘పల్లవి’ - ప్రశాంత్.. ప్లస్, మైనస్‌లు ఇవే, గురూజీని ముంచేస్తాడా?