బిగ్ బాస్ సీజన్ 7లో అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఆరు వారాల నుండి బిగ్ బాస్ ఆటను బయట నుండి చూసి వచ్చారు కాబట్టి ఎంటర్‌టైన్మెంట్ విషయంలో అయినా.. స్ట్రాటజీ విషయంలో అయినా.. అన్నీ ముందస్తుగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు కొందరి ఆటతీరు చూస్తుంటే అనిపిస్తోంది. ట్రాక్స్ నడిపితే కూడా.. బిగ్ బాస్‌లో కంటెంట్ క్రియేట్ అవుతుందని కొందరు బలంగా ఫిక్స్ అయ్యారని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ అయిదుగురిలో నయని పావని ప్రవర్తన చూస్తుంటే ఎలాగైనా కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఓవైపు నయని పావనితో ప్రిన్స్ యావర్ పులిహోర కలుపుతుండగా.. అశ్విని శ్రీ కోసం భోలే షావలి సైతం పులిహోర రాజాలాగా మారాడు.


పులిహోర మొదలు..


నయని పావని, యావర్, ప్రశాంత్ మామూలుగా కిచెన్‌లో కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో యావర్.. ‘‘నా మనసులో ఏముందో చెప్పాను కదా నీకు’’ అన్నాడు. దానికి ప్రశాంత్.. ‘‘మావాడిని బాగా చూసుకో’’ అని నయనితో చెప్పాడు. అయితే ‘‘తెలుగు నేర్చుకో ముందు’’ అని యావర్‌కు సలహా ఇచ్చింది నయని. దీనికి ‘‘నువ్వుంటే చాలా ఇష్టం’’ అంటూ నయనిపై ఇష్టాన్ని అచ్చ తెలుగులో బయటపెట్టాడు యావర్. ఇదంతా వింటున్న భోలే షావలి ఎవరి మనసు వారిది అంటూ ఆ డిస్కషన్‌లో పాల్గొనలేనని తప్పుకున్నాడు. ఇదే డిస్కషన్ గురించి శివాజీకి వెళ్లి చెప్పాడు యావర్. 


నయని పావని, ప్రిన్స్ యావర్ జోడీ..


మా జోడీ ఎలా ఉంది అంటూ తనను, నయనిని ఉద్దేశించి శివాజీని అడిగాడు యావర్. ‘‘జోడీ బాలేదు’’ అని ముక్కుసూటిగా చెప్పేశాడు శివాజీ. ‘‘అన్నా మీరు నా సైడ్ కదా’’ అంటూ శివాజీ సమాధానం మార్పించే ప్రయత్నం చేశాడు యావర్. కానీ శివాజీ మాట మార్చలేదు. ‘‘నీ సైడే కానీ నాకు నచ్చలేదు’’ అనేశాడు. ‘‘జోడీ బాగుండాలి కదా’’ అని మళ్లీ మళ్లీ అదే మాట చెప్పాడు. పక్కన ఉన్న తేజ సిస్టర్‌లాగా ఉంది అంటూ కామెంట్ చేశాడు. అలా అనొద్దు అని శివాజీ అన్నాడు. అయితే నయని ఎస్ చెప్పింది అని శివాజీతో అన్నాడు యావర్. తను చిన్నపిల్లలాగా ఉంది, నువ్వు దున్నపోతులా ఉన్నావంటూ శివాజీ.. యావర్‌పై వ్యాఖ్యలు చేశాడు. 


పుత్తడి బొమ్మ, పాలబుగ్గలు..


గార్డెన్‌లో కూర్చున్న అశ్విని శ్రీతో తన స్టైల్‌లో పులిహోర కలపడం మొదలుపెట్టాడు భోలే షావలి. ‘‘ఇంత అందమైన అమ్మాయిని, ఇంత చిరునవ్వును, ఇంత పాజిటివ్ మెంటాలిటీని, ఇంత పని చేసే అమ్మాయిని ఎక్కడా చూడలేదు’’ అంటూ అశ్వినిని పొగడడం మొదలుపెట్టాడు భోలే. దానికి అశ్విని.. ‘‘బిగ్ బాస్ చూడండి. నాకు నామినేషన్ పడిందని ఏడ్చాను కదా. ఇంక ఏడవను. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘పుత్తడి బొమ్మవిరా నువ్వు. అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు నీ చిరునవ్వు చూస్తే చాలు. ఇది పొగడ్త కాదు. నిజం.. అంటే అంత చక్కగా ఉంటావు. పొద్దునే పాల ప్యాకెట్ అవసరం లేదు. నీ పాలబుగ్గలు అలా చూస్తే చాలు. బయటికి వెళ్లిన తర్వాత నేను హీరోగా, నువ్వు హీరోయిన్‌గా అవకాశం వస్తే బాగుండు అనేంత బాగున్నావు అంటున్నా. టోటల్‌గా మస్తుంటావురా’’ అని ప్రశంసలతో అశ్వినిని చంపేశాడు భోలే. ‘‘వద్దురా బాబు’’ అంటూ భోలే అన్న మాటలకు సిగ్గుపడింది అశ్విని శ్రీ.


Also Read: పల్లెటూరి ప్రేమ పక్షుల్లా అమర్‌దీప్, ప్రియాంక - ‘నల్ల నల్ల మబ్బులా’ సాంగ్‌తో వస్తోన్న రీల్ జోడీ!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial