బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌గా వెళ్లిన వారు బిగ్ బాస్ హౌజ్‌లో ఆట ఆడుతుంటే.. వారు గెలవాలని కోరుకునే వారు మాత్రం బయట నుండి వారికి సపోర్ట్ అందిస్తుంటారు. ముఖ్యంగా హౌజ్‌మేట్స్ ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తుంటాయి. వాటి గురించి హౌజ్‌లో ఉన్నవారికి తెలియకపోయినా.. బయట ఉన్న వారి కుటుంబ సభ్యులకు తెలుస్తుంటాయి. కొందరి కుటుంబ సభ్యులు.. ఆ కామెంట్స్‌పై రియాక్ట్ అవ్వడం అనవసరం అని చూసి వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం రియాక్ట్ అవ్వడానికి ముందుకొస్తారు. తాజాగా అమర్‌దీప్ తల్లి కూడా తన ఆట గురించి, తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి రియాక్ట్ అవుతూ ఒక వీడియో విడుదల చేశారు. 


వీడియో విడుదల చేసిన అమర్‌దీప్ తల్లి..
బిగ్ బాస్ చూస్తున్న చాలామంది ప్రేక్షకులకు అమర్‌దీప్ ముందు నుండే తెలుసు. సీరియల్ యాక్టర్‌గా ఇప్పటికే ఎంతో గుర్తింపును అందుకున్న అమర్‌దీప్.. బిగ్ బాస్ హౌజ్‌లో కూడా అందరినీ ఆకట్టుకుంటాడని అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. చాలా సందర్భాల్లో తన ప్రవర్తనతో ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయిపోయాడు అమర్. ఇక ఈ నెగిటివిటీపై అమర్‌దీప్ తల్లి తాజాగా స్పందించారు. ‘‘బిగ్ బాస్ 7వ సీజన్ జరుగుతోంది. బిగ్ బాస్‌లో అమర్ గురించి చాలా అంటే చాలా నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. చాలా బ్యాడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ ఇంకా ఆపేయండి’’ అంటూ నెటిజన్లను కోరుకున్నారు అమర్‌దీప్ తల్లి రూపా.


తల్లిగా కోరుకునేది ఒక్కటే..
‘‘అమర్‌దీప్ చాలా కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు. అమర్‌దీప్ ఒక మంచి యాక్టర్, డ్యాన్సర్. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు అనవసరంగా అమర్‌దీప్‌ను బ్యాడ్ చేస్తున్నారు. దయచేసి బ్యాడ్ కామెంట్స్‌ను ఆపేయండి. ఇదే నేను కోరుకునేది. నేను తన తల్లిగా ఒకటే కోరుకుంటున్నాను. అమర్‌దీప్ మంచి పేరు తెచ్చుకొని ఆ స్థాయికి ఎదిగాడు. అమర్‌దీప్‌కు ఓటు వేయండి. సపోర్ట్ చేయండి. అక్కడ ఎవరు ఏమీ పెద్ద స్థాయిలో లేరు. మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్లమే. అమర్‌కు పొగరు, అదీ ఇదీ అని చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. దయచేసి అవన్నీ ఆపేసేయండి’’ అంటూ రూపా ఒక వీడియోను విడుదల చేశారు.


అమర్‌దీప్ ప్రవర్తన నచ్చని ప్రేక్షకులు..
అమర్‌దీప్ తల్లి వీడియో చూసిన కొందరు నెటిజన్లు దీనిపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అమర్ ప్రవర్తన తప్పుగా ఉంది కాబట్టే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, అది కూడా తన తల్లి సపోర్ట్ చేస్తుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్ ఒకలాగా ఉంటున్నాడు, మిగతా సమయాల్లో మరొకలాగా ఉంటున్నాడు అంటూ ఇప్పటకే అమర్‌దీప్‌పై ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అడుగడుగునా.. అమర్‌దీప్.. తన బడ్డీ సందీప్‌తో కలిసి చీటింగ్ చేసి గెలవాలి అనుకోవడం కోసం చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే తన స్నేహితులు అయిన అర్జున్ అంబటి, పూజా మూర్తి కూడా అమర్ ఇలా ఆడతాడని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Also Read: రతికను మర్చిపోలేకపోతున్న హౌజ్‌మేట్స్, నయనితో ట్రాక్ కోసం యావర్ విశ్వప్రయత్నాలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial