బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనం చూసేది కొంతే అయితే.. చూడాల్సింది ఇంకా చాలా ఉంటుంది. అందుకే బిగ్ బాస్‌ను విపరీతంగా ఇష్టపడుతూ, అసలు హౌజ్‌లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం 24 గంటలు లైవ్‌ను కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. ఎంతో ఆసక్తితో ఈ లైవ్‌ను చూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒక గంట ఎపిపోడ్‌లో ప్రసారం కాని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ లైవ్‌లో ప్రసారమవుతాయి. తాజాగా జరిగిన లైవ్‌లో కూడా అలాంటి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయిన రతికను పాత కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. కొత్త కంటెస్టెంట్స్ కూడా గుర్తుచేసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ నుండి పల్లవి ప్రశాంత్, రతిక బాగా క్లోజ్ అయిపోయారు. కొన్నిరోజుల వరకు వీరి మధ్య స్నేహం బాగానే కొనసాగింది. కానీ సడెన్‌గా ఏమైందో తెలియదు ప్రశాంత్‌కు ఎదురు మాట్లాడడం మొదలుపెట్టింది రతిక. అక్కడ నుండే ప్రేక్షకులకు తనపై నెగిటివ్ అభిప్రాయం మొదలయ్యింది. అంతే కాకుండా పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా రతిక ఇచ్చినంత కంటెంట్ ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరూ ఇవ్వలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో ఎపిసోడ్ మొత్తం రతిక చుట్టూనే తిరిగేది. ఉదాహరణకు రెండో పవర్ అస్త్రా టాస్క్ సమయంలో కూడా రతిక.. తాను అవతలి టీమ్‌లోని కంటెస్టెంట్‌ను ఎంపిక చేయడానికి ముందుకు వెళ్లను అని మొండికేసింది. ఆ ఎపిసోడ్ మొత్తం రతిక తప్పా ఇంకెవరు కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు కనిపించలేదు.
రతిక, ప్రశాంత్‌ల మధ్య గొడవ..
కొత్త కంటెస్టెంట్స్‌తో కూర్చున్న పాత కంటెస్టెంట్స్ కొందరు రాత్రంతా రతిక గురించే మాట్లాడుకున్నారు. తను చేసిన కొన్ని విషయాలను గుర్తుచేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ముందు కూడా రతిక గురించి మాట్లాడగా.. తను తెగ సిగ్గుపడిపోయాడు. రతిక ఎలిమినేట్ అయ్యే ముందు వారం పల్లవి ప్రశాంత్‌కు, తనకు గొడవ జరిగింది. అప్పుడు పల్లవి ప్రశాంత్ మొదట్లో తనతో సరదాగా అన్న మాటలను రతిక గుర్తుచేసింది. అలా మట్లాడడం కరెక్టా అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో ఈ గొడవలు అన్నీ వద్దు అని చెప్పిన పల్లవి ప్రశాంత్.. తనను చెల్లి లేదా అక్క అని మాత్రమే పిలుస్తానని, కనీసం పేరు పెట్టి కూడా పిలవనని మాటిచ్చాడు. నిజంగానే తను చెప్పినట్టే రతిక హౌజ్‌లో ఉన్నంతవరకు అక్క అని మాత్రమే పిలిచాడు. అలా పిలవడం రతికకు ఇష్టం లేదేమో అన్నట్టుగా పలుమార్లు అనిపించింది.
యావర్ ట్రాక్స్..
ఇక ముందుగా రతికతో ట్రాక్ మొదలుపెట్టాడు ప్రిన్స్ యావర్. అందుకే పవర్ అస్త్రాకు అనర్హుడిగా రతిక తనను నామినేట్ చేసినా.. తానే స్వయంగా వెళ్లి రతికను ఓదార్చాడు. ఆ సందర్భాన్ని నయని పావనితో మాట్లాడుతూ గుర్తుచేసుకున్నాడు యావర్. అసలు అలా ఎందుకు చేశావంటూ ప్రశ్నించింది నయని. అలా మెల్లగా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. నయని అంటూ తనకు ఇష్టమంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడం మొదలుపెట్టాడు యావర్. రతిక వెళ్లిపోయిన తర్వాత శుభశ్రీతో క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టాడు యావర్. ఇక తను కూడా వెళ్లిపోవడంతో కొత్తగా వచ్చిన నయని పావనిని ట్రై చేస్తున్నాడంటూ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. శివాజీ మాత్రం నయని చిన్న పిల్ల అని, నువ్వు దున్నపోతులాగా ఉన్నావంటూ యావర్‌తో సరదాగా అని తన గాలి తీసేశాడు.
Also Read: అమర్‌ను ఆడేసుకున్న ‘బిగ్ బాస్’ - స్పూన్‌తో స్విమ్మింగ్ పూల్‌ను ఖాళీ చేయాలంటూ ఆదేశం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial