బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి సారిగా ఇంటి కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కి (Pallavi Prashanth) ఇంటి సభ్యులందరూ కలిసి గట్టి షాక్ ఇచ్చారు. తను బ్యాడ్ కెప్టెన్ అంటూ విమర్శించారు. అతడిలో లీడర్ షిప్ క్వాలిటీస్ లేవంటూ ఏకతాటిపై నిలబడి అతడి నుంచి కెప్టెన్సీని లాగేసుకున్నారు. దీంతో అతడు కెప్టెన్‌గా అనర్హుడని బిగ్ బాస్ ప్రకటించారు. తనని ఏకాకిని చేయడంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం అతడి అభిమానులను కూడా కంటతడి పెట్టించేలా చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.
కెప్టెన్ క్వాలిటీస్ ఇవేనా..
నాగార్జున ఇచ్చిన మొక్క దగ్గర కూర్చుని తనకి ఇచ్చిన కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టి ప్రశాంత్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసి శివాజీ నిన్ను ఎవర్రా ఆపేది అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ చివర్లో శివాజీనే ప్రశాంత్‌కి వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంది ప్రోమో. బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అనేవాడు చాలా ముఖ్యమైన వాడు. కెప్టెన్ అనేవాడు ఇమ్యూనిటీ పొందేవాడు మాత్రమే కాదు తనకి ఉండే బాధ్యతలు ఏంటో చెప్పమని బిగ్ బాస్ శోభాశెట్టిని అడిగాడు. అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పుకొచ్చింది. లీడర్ షిప్ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని అమర్ అన్నాడు. కమాండింగ్ కెపాసిటీ ఉండాలని పూజా మూర్తి, తాను వర్క్ చేస్తూ పది మందితో పని చేయించాలని సందీప్ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ ఇంటికి రెండో బిగ్ బాస్..
కెప్టెన్ అనేవాడు ఇంటికి రెండో బిగ్ బాస్ లాంటి వాడని అర్జున్ అంబటి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఎప్పుడు ప్రశాంత్‌కి అండగా నిలిచే శివాజీ కూడా ఈ విషయంలో వ్యతిరేకించాడు. బయట కెప్టెన్సీ వేరు ఇక్కడ వేరు అంటూ శివాజీ అన్నాడు. ఇక చివరిగా మంచి కెప్టెన్‌కి ఉండాల్సిన లక్షణాలు ఏంటని బిగ్ బాస్ ప్రశాంత్‌ని అడిగాడు. “నేను పని చేస్తూ వాళ్లతో పని చేయించాలి. కానీ వాళ్లు నేను చెప్పింది వినడం లేదు. కొన్ని పనులు చెప్పినా కొందరు వీడు ఎందని అన్నట్టు చూశారు. కెప్టెన్ అంటే నేను పనులు చేస్తూ వాళ్లతో చేపించాలని” ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తను బ్యాడ్ కెప్టెన్ అని ఇంట్లో ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తమని బిగ్ బాస్ ఆదేశించాడు. అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేసి తనకి ఇచ్చిన బ్యాడ్జ్‌ని తిరిగి తీసుకుంటున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ క్షణంలో ప్రశాంత్‌ని చూస్తే సగటు ప్రేక్షకుడికి కూడా జాలి వేస్తుంది.
Also Read: ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది, లాస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చి ఆట మార్చిన గౌతమ్