బిగ్ బాస్ సీజన్ 7లో 2.0 వర్షన్ ప్రారంభమయిన తర్వాత బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌తో మరింత సరదాగా ఉండడం మొదలుపెట్టారు. నేడు (అక్టోబర్ 10న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో ప్రతీ విషయానికి కంటెస్టెంట్స్‌కు ఏదో ఒక కౌంటర్ వేస్తూనే ఉన్నారు బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే ఈ రెండు టీమ్స్‌లో ఎవరు బెస్ట్ అని నిరూపించుకుంటారో.. వారికే హౌజ్ అధికారం దక్కుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. దానికోసం ఈ రెండు టీమ్స్ ఫిజికల్‌గా మాత్రమే కాకుండా మేధస్సుతో కూడా పోటీపడాల్సి ఉంటుంది. ఇక ‘హూ ఈజ్ జీనియస్’ అంటూ జరిగిన టాస్క్‌లో కంటెస్టెంట్స్‌తో కలిసి బిగ్ బాస్ కూడా ప్రేక్షకులను నవ్వించారు.


హూ ఈజ్ జీనియస్..
‘హూ ఈజ్ జీనియస్’ టాస్కులో ముందుగా టీవీలో కొన్ని ఫోటోలు చూపిస్తామని, ఆ తర్వాత దాన్నిబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అయితే మీరందరిలో ఎవరు జీనియస్ అని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని బిగ్ బాస్ అడగగా.. కంటెస్టెంట్స్ అంతా ఉత్సాహంగా అవును అంటూ సమాధానమిచ్చారు. ఇక ఈ టాస్క్ ఆడడం కోసం ఆటగాళ్ల నుండి అమర్‌దీప్, పోటుగాళ్ల నుండి గౌతమ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ అడిగిన మొదటి ప్రశ్నకు అమర్‌దీప్ సరిగ్గా సమాధానం ఇచ్చాడు. అయితే శివాజీ చెప్తేనే అమర్ సమాధానమిచ్చాడు అంటూ అమర్‌పై ఆరోపణలు చేసింది పూజా. దానికి అమర్ ఒప్పుకోలేదు. పూజా కూడా ఎక్కువగా వాదించకుండా బిగ్ బాస్‌నే నిర్ణయించుకోమని చెప్పి సైలెంట్‌గా కూర్చుంది.


అంత నవ్వాల్సిన అవసరం లేదు..
రెండో ప్రశ్నకు గౌతమ్ సరిగా సమాధానమిచ్చాడు. మూడో ప్రశ్నకు కూడా గౌతమ్ సరిగా సమాధానం ఇవ్వగా అమర్‌దీప్ అయోమయంగా నిలబడ్డాడు. అయితే ‘‘అమర్‌దీప్.. ప్రశ్న మీకు అర్థమయ్యిందా’’ అంటూ అమర్‌ను ప్రశ్నించాడు బిగ్ బాస్. అర్థమయ్యింది అని అమర్ సమాధానమివ్వగా.. ఏం అర్థమయ్యిందో బిగ్ బాస్ చెప్పమన్నాడు. అమర్.. తనకు అర్థమయిన సమాధానాన్ని చెప్పగా.. బిగ్ బాస్ తనకు కౌంటర్ ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. ‘‘అంత నవ్వాల్సిన అవసరం లేదు. తెలియనప్పుడు తెలీదు అని ఒప్పుకున్నాను’’ అంటూ ఫీల్ అయ్యాడు అమర్‌దీప్. ఆ తర్వాత ప్రశ్నకు కూడా గౌతమే సరిగా సమాధానమివ్వగా ఆటగాళ్ల టీమ్ నుండి కంటెస్టెంట్‌ను మార్చుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీంతో అమర్‌దీప్ తప్పుకొని, తేజకు అవకాశం ఇచ్చాడు.


తేజకు బిగ్ బాస్ బ్యాక్ టు బ్యాక్ కౌంటర్లు..
తేజ ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు గౌతమ్ బజర్ నొక్కినా కూడా గౌతమ్ తప్పు సమాధానం చెప్పాడు. తేజ బజర్ నొక్కకపోయినా కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్నకు గౌతమ్ కరెక్ట్ సమాధానం ఇవ్వగా.. ఆపై అడిగిన ప్రశ్నకు తేజ కరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. బజర్ నొక్కడం కష్టంగా ఉంది కానీ వెంటవెంటనే ప్రశ్నలు అడిగితే మాత్రం చెప్తా అని తేజ అన్నాడు. అలా గౌతమ్, తేజ హోరాహోరీగా జీనియస్ టాస్కులో పోటీపడ్డారు. తేజ ఇచ్చిన ప్రతీ సమాధానానికి బిగ్ బాస్ కౌంటర్ ఇచ్చారు. దానికి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. టాస్క్ ముగిసిన తర్వాత అమర్‌దీప్ ఆడకపోవడాన్ని సమర్ధించుకున్నాడు. చదువులో వీక్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అమర్ ఆటను తన టీమ్‌మేట్స్ సైతం తలచుకొని నవ్వుకున్నారు. ఇక జీనియస్ టాస్కులో ఆటగాళ్లకు 4 పాయింట్స్ రాగా.. పోటుగాళ్లకు 5 పాయింట్స్ వచ్చాయి. దీంతో పోటుగాళ్లు టీమ్ విన్ అయ్యారు. అంతకు ముందు జరిగిన ఫిజికల్ టాస్కులో కూడా పోటుగాళ్లు టీమే విన్ అయ్యారు.


Also Read: ఒకరు గడ్డి తింటే మీరూ గడ్డి తింటారా - బండారు, రోజా వివాదంపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial