బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. ఆరు వారాలుగా హౌజ్‌లోనే ఉంటున్నవారంతా ఒకవైపు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారంతా ఒకవైపు ఉన్నారు. ఇక ఎలిమినేషన్ అనుకొని సీక్రెట్ రూమ్‌కు వెళ్లిన గౌతమ్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ వైపు నిలబడ్డాడు. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ మధ్య రెండు పోటీలు పూర్తయ్యాయి. నేడు (అక్టోబర్ 11న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మరో రెండు పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు టాస్కులలో ఒక టాస్క్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. తాజాగా మరో టాస్క్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది.


ఎవరు స్ట్రాంగ్ అని బయటపెట్టే టాస్క్..


‘బిగ్ బాస్ ఇస్తున్న నాలుగో టాస్క్ హూ ఈజ్ ది స్ట్రాంగెస్ట్’ అని బిగ్ బాస్ చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. ఈ టాస్క్ కోసం రెండు పెద్ద రాకెట్ ఆకారం ఉన్న బొమ్మలు గార్డెన్ ఏరియాలో పెట్టబడి ఉన్నాయి. ‘ఇరు గ్రూప్స్ నుంచి ఎవరైతే వాటిని చివరివరకు పట్టుకొని తాము స్ట్రాంగ్ అని నిరూపించుకుంటారో వారు ఈ టాస్క్‌లో విజయం సాధించి స్ట్రాంగెస్ట్ టీమ్ అని బిరుదును సాధించుకుంటారు.’ అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏ టీమ్ నుంచి ఎవరు వెళ్లాలి అనే చర్చ మొదలయ్యింది. పోటుగాళ్లు టీమ్ నుంచి గౌతమ్ వెళ్లాలా, అర్జున్ వెళ్లాలా అని డిస్కషన్ పెట్టుకున్నారు.


ఎలాగైనా చావండ్రా..


ఆటగాళ్లు టీమ్ నుంచి అమర్‌దీప్.. నేను ఆడతాను అంటూ ముందుకొచ్చాడు. ‘‘అరె నువ్వు ప్రతీది ఆడతాను అంటావేంట్రా’’ అని శివాజీ సీరియస్ అయ్యాడు. ‘‘నేను పట్టుకుంటాను. నేను పట్టుకోలేను అంటావేంటి’’ అని అమర్‌దీప్.. శివాజీని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అది గట్టిగా ఉంటుంది అంటూ అమర్‌దీప్ వెళ్లడం కరెక్ట్ కాదు అంటూ ఇతర టీమ్‌మేట్స్.. తనను ఒప్పించే ప్రయత్నం చేశారు. పోటుగాళ్లు నుంచి అర్జున్ వెళ్దామని నిర్ణయించుకునే సమయానికి ఆటగాళ్ల నుంచి ఎవరు వెళ్లాలి అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. అమర్‌దీప్ మాట వినకపోవడంతో.. తేజ కూడా నేను పోతా అంటూ ముందుకొచ్చాడు. ఈ డిస్కషన్ అంతా చూసిన శివాజీకి చిరాకు వచ్చి ‘‘ఎలాగైనా చావండ్రా. మొత్తం దాంట్లో దూకి చావండి’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఏ టీమ్ నుంచి ఎవరు వెళ్లాలి అని ఇంత డిస్కషన్ పెడుతున్నారు ఏంటి అంటూ భోలే షావలి ఫన్నీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కాసేపు నవ్వుకున్నారు. 


యావర్ వర్సెస్ అర్జున్..


ఇక డిస్కషన్స్ అంతా ముగిసిన తర్వాత ఆటగాళ్లు నుంచి ప్రిన్స్ యావర్, పోటుగాళ్లు నుంచి అర్జున్ బరిలోకి దిగారు. వారు రెండు చేతులతో రెండు రాకెట్ బొమ్మలను లాగి పట్టుకున్నారు. మధ్యలో అర్జున్.. ఓడిపోతున్నట్టు అనిపించగానే తనకు ధైర్యం చెప్పడానికి గౌతమ్ ముందుకొచ్చాడు. ‘‘నువ్వు చాలా స్ట్రాంగ్. నీ చేతులు నీ బాడీలో పార్ట్ కాదు. అవి పట్టుకోవడానికే ఉన్నాయి. నిన్ను మించిన తోపు ఎవరూ లేరిక్కడ. ఇది నీ ఫస్ట్ టాస్క్’’ అని గౌతమ్ చెప్తుండగానే ఒక చేతిలో ఉన్న రాకెట్‌ను వదిలేశాడు. ఆ తర్వాత కాసేపటికి యావర్ కూడా ఒక చేతిలో ఉన్న రాకెట్‌ను వదిలేశాడు. ఇక ఈ టాస్క్‌లో యావర్ గెలిచాడా లేక అర్జున్ గెలిచాడా తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.



Also Read: దయచేసి అవన్నీ అపేయండి - ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు అమర్‌దీప్ తల్లి రిక్వెస్ట్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial