Bigg Boss 8 Telugu Episode 32 Day 31 written Review: బిగ్ బాస్ ఇంట్లో 31వ రోజు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసినట్టుగా బిగ్ బాస్ తెలిపాడు. ఇకపై ఇంట్లో ఒకటే క్లాన్, ఒకడే చీఫ్ అని చెప్పాడు. నెక్ట్స్ వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉంటుందని, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో శక్తి క్లాన్ ఎక్కువ చాలెంజ్‌లు గెలిచినందుకు వారి టీం నుంచి ఓ చీఫ్ కంటెండర్‌ను ఎంచుకోవాలని అన్నాడు. దీంతో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ఆదిత్య ముచ్చట్లు పెట్టుకున్నారు. సుధీర్ఘ వాగ్వాదం తరువాత చివరకు పృథ్వీని చీఫ్ కంటెండర్‌గా నిలబెట్టారు. ఇంకో చీఫ్ కంటెండర్ కోసం పప్పీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.


బుధవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే... మార్నింగ్ మస్తీ అంటూ ఓ క్రింజ్ టాస్కుని బిగ్ బాస్ పెట్టాడు. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ ఓ పరమ నాసిరకంగా టాస్కును పెట్టాడు. అందులో ఓడిన మణికంఠను ఐటం సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నాడు... యష్మీకి ప్రేరణ ఓ పిచ్చి టాస్క్ ఇచ్చింది. ఆ టాస్కుని చూశాక... ఆడియెన్స్ నెత్తి పట్టుకోవాల్సిందే. ఇంత వరెస్ట్‌గా ఉన్నారేంట్రా బాబు అని అనుకోవాల్సిందే. ఆ తరువాత పృథ్వీకి లేడీ వేషం వేశారు. అదొక ఆణిముత్యం నేటి ఎపిసోడ్‌లో చూడాల్సి వచ్చింది.


ఆ తరువాత రెండో చీఫ్ కంటెండర్ కోసం టాస్క్ జరిగింది. ఇందులో మొదటగా యష్మీ మణికంఠ పేరున్న పప్పీని పట్టుకుంది. దీంతో యష్మీ, మణికంఠ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఆ రౌండ్‌కు పృథ్వీ సంచాలక్‌గా ఉన్నాడు. యష్మీ, మణి కారణాలు విన్న పృథ్వీ... చివరకు మణిని ఆట నుంచి తప్పించేశాడు. దీంతో రెండో రౌండ్‌కు మణికంఠ సంచాలక్ అయ్యాడు. రెండో రౌండ్లో యష్మీ ప్రేరణ పేరున్న పప్పీని తీసుకొచ్చింది. ఆ రౌండ్‌లో మణికంఠ.. యష్మీని పక్కకు తప్పించాడు. ఇక మూడో రౌండ్‌కు యష్మీ సంచాలక్‌గా ఉండాలి.


Also Read: బిగ్‌ బాస్ ఎపిసోడ్ 30 రివ్యూ... పోయే వరకు నామినేట్ చేస్తా, రివేంజ్ అనుకో - మణికంఠపై యష్మీ మండిపాటు


కానీ పప్పీలను మణికంఠ తనకు నచ్చిట్టుగా ఓ క్రమంలో పెట్టాడు. అలా ఎందుకు పెడుతున్నావ్.. నువ్వు ఈ రౌండ్‌కు సంచాలక్ కాదు అంటూ మణికంఠని సీత అడ్డుకుంది. అక్కడ మాటా మాటా పెరిగింది. అందరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని, కార్నర్ చేస్తున్నారని మణికంఠ ఫీల్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ తనను కార్నర్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తోందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇలా పదే పదే మణికంఠ టాస్కుల్లో స్ట్రాంగ్‌గా ఆడకుండా.. ఇలా పదే పదే కన్నీరు పెట్టుకుంటూ సింపతీ కార్డ్ వాడితే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడో సారి ఆడియెన్‌కు విరక్తి పుట్టి మణిని అవతల పారేస్తాడు.


ఇక ఈ పప్పీల టాస్కు అయితే బుధవారం పూర్తి కాలేదు. ఈ టాస్కులో చివరి వరకు నబిల్ నిలుస్తాడనరి, నబిల్ నిఖిల్‌కు టాస్క్ పెడితే.. గెలిచిన పృథ్వీ ఇంటికి ఏకైక చీఫ్ అవుతాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డులు వచ్చే వరకు ఇంట్లో ఒకటే క్లాన్ అని, ఒకడే చీఫ్ (పృథ్వీ) అని తెలుస్తోంది. ఇక నెక్ట్స్ వీక్ నుంచి వైల్డ్ కార్డులు వర్సెస్ ఓల్డ్ పృథ్వీ క్లాన్ అన్నట్టుగా మారుతుందనిపిస్తోంది.


Also Readపాపం సోనియా.. దారుణంగా రోస్ట్ చేసిన అర్జున్ అంబటి - ట్రోలర్లు కూడా ఈ రేంజ్‌లో ఆడుకోరు