Bigg Boss 8 Telugu Episode 30 Day 29 written Review : బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ఎక్కువగా నాగ మణికంఠ, విష్ణు ప్రియను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. 'మాటలు మార్చుతున్నావ్' అంటూ మణికంఠను అందరూ కలిసి టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. 'ఆటలు ఆడటం లేదు... మాటలు ఇష్టమొచ్చినట్టుగా వదలుతున్నావ్' అంటూ విష్ణు ప్రియను నామినేట్ చేశారు. చివరకు నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో చీఫ్‌లకు షాక్ తగిలింది. అదేంటో చూద్దాం. సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే...
మణికంఠను జైల్లో వేయమని సీతను బిగ్ బాస్ ఆదేశించాడు. సోనియా వెళ్లిపోయినందుకు సంతోషంగా, ప్రశాంతంగా ఉందని ప్రేరణతో విష్ణు ప్రియ చెప్పింది. 'ఇన్ని వారాల్లో తనతో మొదటి సారి మాట్లాడాడు' అంటూ నిఖిల్ గురించి ప్రేరణ చెప్పింది. సోనియా ఉన్నంత వరకు నిఖిల్ వద్దకు వెళ్లలేకపోయామంటూ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. మరో వైపు విష్ణు ప్రియ మాట్లాడిన మాటల గురించి నిఖిల్ చెప్పుకొచ్చాడు. 'దద్దోజనం, పప్పు అని ఎందుకు మాట్లాడిందో తెలుసుకో' అని నిఖిల్‌కు యష్మీ చెప్పింది.
ఇక తెల్లవారాక మణికంఠను జైల్లో నుంచి రిలీజ్ చేయమని సీతని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ తరువాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ముందుగా మణికంఠ నామినేషన్ ప్రాసెస్ట్ స్టార్ట్ చేశాడు... 'నైనిక.. ఒకప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేది. ఆమెలో డెసిషన్ పవర్ తగ్గింది. క్లారిటీ తగ్గింది. బెడ్రూంలో తప్ప ఇంకెక్కడా కనిపించడం లేదు' అని కారణాలు చెప్పాడు. 'నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను' అంటూ నైనిక చెప్పింది.
యష్మీని 'ఎగ్స్ టాస్కులో ఎంత ఆడానో చూశావ్. నన్ను ఫిజికల్‌గా వీక్ అన్నావ్. పుటేజ్ చూపించకముందే నువ్వే రియలైజ్ అయి చెబితే బాగుండేది' అంటూ మణికంఠ నామినేట్ చేశాడు. 'ఆ ఉద్దేశంలో నేను మాట్లాడలేదు' అంటూ యష్మీ క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత నైనిక వచ్చి నబిల్‌ను నామినేట్ చేసింది. సంచాలక్‌గా సీరియస్‌గా ఉండకుండా ఫన్‌గా తీసుకోవడం వల్లే రేషన్ పోయిందని చెప్పింది. విష్ణుని నామినేట్ చేస్తూ... 'మనం మాట్లాడుకునే మాటలు బయటకు వెళ్తున్నాయి' అంటూ కారణాలు చెప్పింది.
ఆ తరువాత సీత తన నామినేషన్‌ను కంటిన్యూ చేసింది. మణికంఠను నామినేట్ చేస్తూ.. మాటలు ఫ్లిప్ అయ్యాడని చెప్పింది. ఆ కారణాలు చెప్పే క్రమంలో మణికంఠలా బాడీ లాంగ్వేజ్‌తో చేసి చూపించింది. దీంతో ఆ బాడీ లాంగ్వేజ్ పట్ల మణికంఠ సీరియస్ అయ్యాడు. 'అలా బాడీ లాంగ్వేజ్ చూపెట్టొద్దు' అంటూ ఫైర్ అయ్యాడు. 'నువ్వు కూడా వేలు పెట్టి చూపించకు' అంటూ మణికంఠకు సీత వార్నింగ్ ఇచ్చింది. విష్ణు ప్రియని నామినేట్ చేస్తూ... 'ఆటలు ఆడటం లేదు. ముందకు రావాల'ని కారణాలు చెప్పింది.
నబిల్ వచ్చి విష్ణుని నామినేట్ చేశాడు. 'ఆటలు ఆడాలి, ఇంట్లో ఉండాలన్న కసి కనిపించడం లేద'ని కారణాలు చెప్పాడు. 'ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాను. ఉన్నంత వరకు ట్రై చేస్తాను. ఆడియెన్స్ ప్రేమ ఎంత వరకు ఉంటే అంత వరకు ఉంటాను' అని విష్ణు ప్రియ చెప్పింది. ఆ తరువాత నబల్.. నైనికను నామినేట్.. ఫస్ట్ వీక్ యాక్టివ్‌గా ఉన్నావ్.. ఆ తరువాత మళ్లీ ఇంత వరకు ఆ యాక్టివ్ నెస్ కనిపించడం లేదు.. ఓవర్ థింకింగ్.. నీ స్పేస్‌లోనే ఉంటున్నావ్.. డల్‌గా ఉంటున్నావ్.. అని కారణాలు చెప్పాడు.
ఆదిత్య వచ్చి మళ్లీ నైనికనే నామినేట్ చేశాడు. ఆమె గత వారం తనని కారణం లేకుండా నామినేట్ చేసిందని అన్నాడు. సేఫ్ ఆడి నామినేట్ చేసినట్టు అనిపించిందని అందుకే ఆమెను ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పాడు. విష్ణు.. ఇక్కడ మనం ఇచ్చే ట్యాగులు, మాట్లాడే మాటలు.. బయట ఫిక్స్ అవుతాయ్.. కాస్త మర్యాదగా మాట్లాడండి.. అంటూ ఆమెను నామినేట్ చేశాడు.
నిఖిల్ వచ్చి.. విష్ణుని నామినేట్ చేస్తూ.. మాటలు జాగ్రత్తగా ఉండాలి.. హద్దుల్లో మాట్లాడాలి అని చెప్పుకొచ్చాడు.. నీకే నోటి దూల.. నువ్వు నాకు చెబుతున్నావా.. నేను ఎవ్వరినీ నా మాటలతో ఇబ్బంది పెట్టలేదు.. అంటూ విష్ణు ప్రియ కౌంటర్ వేసింది. మాటలు మార్చుతున్నావ్ అంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ వారం సేఫ్ అయితే చాలు అని అంటావ్.. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? అని నామినేట్ చేశాడు.
ఆ తరువాత ప్రేరణ వచ్చి మళ్లీ మణికంఠనే నామినేట్ చేసింది. 'త్యాగం చేస్తా అనే మాటే రాకూడదు. నీ ఆట నువ్వు ఆడాలి' అంటూ కారణాలు చెప్పింది. ఆదిత్యలో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు.. షుగర్ కోట్ వేసి మాటలు చెప్పకండి.. అంటూ కారణాలు చెప్పి నామినేట్ చేసింది. దీంతో హర్ట్ అయిన ఆదిత్య మంటల్లో వేసిన తన ఫోటోను చేయి పెట్టి తీశాడు. అలా మంటల్లో చేయి పెట్టడంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఇలా ఎవ్వరూ చేయొద్దని హెచ్చరించాడు.
విష్ణు ప్రియ వచ్చి... నైనికను నామినేట్ చేసింది. 'నువ్వు ఆడిన గేమ్ విధానం నచ్చలేదు... నిర్ణయాలు తీసుకోలేదు' అంటూ కారణాలు చెప్పింది. నబిల్.. సంచాలక్‌గా సీరియల్‌గా ఆడి ఉంటే రేషన్ మిస్ అయ్యేది కాదు అంటూ కారణాలు చెప్పింది. ఆ తరువాత యష్మీ వచ్చి.. మణికంఠను నామినేట్ చేసింది. 'నీ తప్పుల్ని నాగ్ సర్ చూపించినా నువ్వు రియలైజ్ కాలేదు. కానీ నా తప్పు లేకపోయినా నేను సారీ చెప్పా' అని వాగ్వాదానికి దిగింది. 'నేను నా తప్పుల్ని సరిచేసుకుంటున్నాను... అందుకే ఇక్కడ ఉంటున్నా' అని మణికంఠ అంటే... 'నువ్వు ఎలా సేఫ్ అవుతున్నావో నాకు తెలీడం లేదు' అని యష్మీ కౌంటర్ వేసింది.
Also Read: పాపం సోనియా.. దారుణంగా రోస్ట్ చేసిన అర్జున్ అంబటి - ట్రోలర్లు కూడా ఈ రేంజ్‌లో ఆడుకోరు
'నువ్వు వెళ్లే వరకు నిన్ను కంటిన్యూగా నామినేట్ చేస్తూనే ఉంటా... రివేంజ్ అని అయినా అనుకో... నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్...' అంటూ మణికంఠ మీద తన ద్వేషాన్ని ప్రకటించింది యష్మీ. ఇలాంటి పిచ్చి పనులు, రివేంజ్‌ల వల్లే కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుంటారని, ఇలా ఓ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేస్తూ.. అతడే ఆడియెన్స్ దృష్టిలో హీరో అవుతాడని యష్మీకి తెలియడం లేదు. గతంలో ఇలానే రాహుల్‌ను టార్గెట్ చేసి శ్రీముఖి విలన్ అయింది. చివరకు రాహుల్ విజేత అయ్యాడు. ఇక యష్మీ.. ఆదిత్యను నామినేట్ చేస్తూ.. క్లాన్ మెంబర్‌గా బాగానే ఆడతారు.. కానీ మీలో క్లారిటీ లేదు.. మీ నిర్ణయం మీరు చెప్పరు.. అని కారణాలు చెప్పింది.
పృథ్వీ.. నైనికను నామినేట్.. విష్ణుతో మాట్లాడుతున్నప్పుడు.. మా ఫ్రెండ్ షిప్‌ను బ్రేక్ చేయకు అని మీరు ఏం తెలియకుండా నోరు జారారు.. అది నాకు నచ్చలేదు అని కారణాలు చెప్పాడు. మణికంఠ మాటలు మార్చుతున్నాడు.. త్యాగం చేస్తా అన్నాడు.. మళ్లీ మాట మార్చాడు అని చెప్పుకొచ్చాడు. ఇక అలా ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్‌ల్లోంచి ఒకరిని సేఫ్ చేయాలని, ఇంకొరిని నామినేట్ చేయాలని అది కూడా ఇంటి సభ్యుల మెజార్టీతో చేయాలని అన్నాడు. దీంతో సీతను సేఫ్ చేయాలని మెజార్టీ సభ్యులు ఓటు వేశారు. దీంతో చివరకు నిఖిల్ నామినేషన్‌లోకి వచ్చారు. అలా ఈ ఐదో వారంలో విష్ణు, నైనిక, మణి, ఆదిత్య, నబిల్, నిఖిల్ నామినేట్ అయ్యారు. మరి ఈ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. వీకెండ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.