తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ నడుమ బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగవ వారం ఎలిమినేషన్ లో సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జనాలు కాకుండా హౌస్ మేట్స్ ఆమెను బయటకు పంపడం గమనర్హం. ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతను నిజం చేస్తూ తాము ఇష్టపడే మగాళ్లు సోనియాకు దగ్గరవ్వడం చూసి ఓర్వలేకపోయిన హౌస్ లోని లేడీ కంటెస్టెంట్స్ సోనియాను బయటకు పంపేశారు. మరోవైపు సోనియా, నిఖిల్, పృథ్విలను తన కనుసన్నల్లో ఆడిస్తున్నాను అని ఫీల్ అయింది. హౌస్ మేట్స్ దూరమవుతున్నారన్న విషయాన్ని పసి కట్టినప్పటికీ ఫలితం చేజారిపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ హౌస్ లో ఆమెను అర్జున్ అంబటి దారుణంగా ట్రోల్ చేస్తూ కనిపించారు. సోనియా బాగోతాల వీడియోను చూపిస్తూ 'కపట నాటక సూత్రధారి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చూడలేదా?' అంటూ దారుణంగా ప్రశ్నించాడు సోనియాని. మరి ఈ ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి.
క్వశ్చన్ అర్జున్ అంబటి స్టైల్లో, ఆన్సర్ సోనియా స్టైల్లో...
మో మొదట్లోనే 'క్వశ్చన్ మీ స్టైల్లో అడగండి ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా' అని చెప్పింది సోనియా. 'హౌస్ లో ఎవరితో బెస్ట్ బాండింగ్ ఉంది ?' అంటే అభయ్, నిఖిల్, పృథ్విల పేర్లు చెప్పింది. 'నిఖిల్ మీద మీ ఫీలింగ్ ఏంటి ?' అని అర్జున్ అంబటి సూటిగా అడగ్గా.. 'మా అన్నలాగా.. ఇంట్లో వాళ్ళ లాగా' అని మళ్ళీ నిఖిల్ ని పెద్దోడు అని చెప్పుకొచ్చింది. ఇక పృథ్వి ఆవేశం గురించి ప్రస్తావించగా 'నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాను' అని సోనియా అనడంతో.. 'చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటారు. కపట నాటక సూత్రధారి' అంటూ గట్టిగానే రోస్ట్ చేశాడు. 'హౌస్ లో వీక్ ఎవరు?' అంటే 'నైనిక' అని సోనియా చెప్పగా.. 'నిఖిల్ అని జనాలు అనుకుంటున్నారు' అంటూ నగ్న సత్యాన్ని బయట పెట్టాడు అర్జున్.
కానీ సోనియా దానికి అంగీకరించకుండా 'నిఖిల్ టాప్ 3 లో ఉంటాడు' అని నమ్మకంగా చెప్పింది. 'ఆడపులి అని నీకు నువ్వే బిరుదు ఇచ్చుకున్నావా' అని అర్జున్ అడిగితే... 'నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు' అని చెప్పింది. అయితే 'ఆడ పులి అంటే ముందుకొచ్చి ఆడాలి.. పిల్లి లాగా వెనక నుంచి కాదు' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'నిఖిల్, పృథ్వీ నీవల్ల బాధితులుగా మారారు' అని అర్జున్ అంటే... 'బాధితులు వాళ్లయితే వాళ్లు కదా బయటకు రావాలి.. నేను ఎందుకు వచ్చాను' అని తిరిగి ప్రశ్నించింది సోనియా. ఇక ఆ తర్వాత ఆమెపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, లిమిట్ లెస్ హగ్స్ చూపిస్తూ 'ఆ హగ్ లను ఇంట్లో వాళ్ళు చూడరా' అని అడిగాడు అర్జున్ చెప్పింది. కానీ ఆమె స్మార్ట్ గా అవి మెమొరబుల్ మూమెంట్స్ అని సమాధానం ఇచ్చింది. ఇక చివరిగా 'నువ్వు స్మోకింగ్ మానేస్తే ఏం అడిగితే అది ఇస్తాను అని చెప్పావు కదా?' అని అర్జున్ ప్రశ్నించగా.. సోనియా ఆలోచిస్తూ ఉండిపోయింది. దీంతో ప్రోమో ఎండ్ అయింది. మరి ప్రోమోనే ఇలా ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ కాకరేపడం ఖాయం.
ఆమె నోటితోనే చెప్పించిన అర్జున్ అంబటి
అయితే ఇన్ని రోజులూ హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సోనియా వల్ల నిఖిల్, పృథ్వీ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నారని ఫీల్ అయ్యారు. కానీ సోనియా ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. కానీ తాజాగా రిలీజ్ అయిన బజ్ ప్రోమోలో మాత్రం అర్జున్ అంబటి ఈ విషయాన్ని ఆమె నోటితోనే చెప్పించడం విశేషం.
Also Read: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...