ఈరోజు హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ఆ తరువాత వెంటనే హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. వారితో ఓ గేమ్ ఆడించారు. సినిమా పేర్లు ఇచ్చి.. అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలని అన్నారు నాగార్హున. ప్రియాంక 'మహానటి' అని సన్నీ ఆమెకి బ్యాడ్జ్ ఇచ్చాడు. మానస్ తో ఏమైనా గొడవ అయితే తన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ మారిపోతాయని.. ఆ తరువాత వెంటనే సెట్ అయిపోతుంటారని.. ఆమెలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు.
షణ్ముఖ్ కి 'రోబో' సినిమాలో వసీకరన్ పాత్ర సూట్ అవుతుందని పక్క వాళ్లను బాగా కంట్రోల్ చేస్తాడని సిరి అతడికి బ్యాడ్జ్ ఇచ్చింది. సిరికి 'నీలాంబరి' క్యారెక్టర్ బ్యాడ్జ్ ఇచ్చాడు షణ్ముఖ్. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనుకునే క్యారెక్టర్ అని చెప్పాడు. శ్రీరామ్ 'కట్టప్ప' బ్యాడ్జ్ ని సిరికి ఇచ్చాడు. గేమ్ లో తనను వెన్నుపోటు పొడిచిందని చెప్పాడు. 'అర్జున్ రెడ్డి' బ్యాడ్జ్ ను సన్నీకి ఇచ్చింది కాజల్. శ్రీరామ్ రేలంగి మావయ్య అని అతడికి ఆ బ్యాడ్జ్ ఇచ్చాడు మానస్. 'అపరిచితుడు' బ్యాడ్జ్ ను మానస్ కి ఇచ్చింది ప్రియాంక. 'భానుమతి' బ్యాడ్జ్ ను కూడా సిరికే ఇచ్చారు. 'పెదరాయుడు' బ్యాడ్జ్ ను షణ్ముఖ్ కి ఇచ్చింది కాజల్. అతడు బాగా డామినేట్ చేస్తాడని చెప్పింది. 'చిట్టిబాబు' బ్యాడ్జ్ సన్నీకి ఇచ్చారు హౌస్ మేట్స్. 'ఇస్మార్ట్ శంకర్' బ్యాడ్జ్ మానస్ కి ఇచ్చాడు షణ్ముఖ్. ఎవడి మాటా వినని 'సీతయ్య' బ్యాడ్జ్ ను సన్నీకి ఇచ్చింది ప్రియాంక. అన్ లక్కీ ఫెలో 'మర్యాద రామన్న' శ్రీరామచంద్ర అని అతడికి బ్యాడ్జ్ ఇచ్చాడు సన్నీ.
మానస్ సేఫ్.. : నామినేషన్ లో ఉన్న శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సిరిలను నుంచోమని చెప్పిన నాగార్జున స్టేజ్ పై నుంచి ఎవరు సేఫ్, ఎవరు అన్ సేఫ్ అనే విషయాన్ని క్యూబ్స్ ద్వారా వెల్లడించారు. ఇందులో మానస్ సేఫ్ అని వచ్చింది.
హౌస్ మేట్స్ తో మరో గేమ్ ఆడించారు నాగార్జునహౌస్ మేట్స్ కి కొన్ని సినిమా పాటలు ఇచ్చి, నోట్లో నీళ్లు వేసుకొని ఆ పాట పాడమని చెప్పారు. వాళ్లు పాడలేక పడ్డ ఇబ్బందులు నవ్వులు పూయించాయి.
కాజల్ సేఫ్.. : నామినేషన్ లో ఉన్న కాజల్, ప్రియాంక, సిరిల ముందు కలర్డ్ సాండ్ పెట్టారు. అందులో ఒక బాల్ ఉంటుంది. దాని మీద సేఫ్, అన్ సేఫ్ అని రాసి ఉంటుందని చెప్పారు. ఇందులో కాజల్ సేఫ్ అని వచ్చింది.
కాజల్ ని ఇమిటేట్ చేసిన నాగార్జున..: ఆ తరువాత హౌస్ మేట్స్ తో లూడో గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో సన్నీకి పనిష్మెంట్ రావడంతో 'ఎపిసోడ్ అయ్యేవరకు లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేసుకొని ఉండాలని' నాగార్జున చెప్పారు. దీంతో కాజల్, ప్రియాంక.. సన్నీకి మేకప్ వేశారు. ఆ గెటప్ లో సన్నీ ఎంతో ఫన్నీగా కనిపించాడు. ఆ తరువాత మానస్ కి క్వశ్చన్ రావడంతో.. 'ఈ ఇంట్లో సింపతీ సీకర్ ఎవరని' అడిగారు నాగార్జున. దానికి మానస్.. కాజల్ పేరు చెప్పాడు. దానికి నాగార్జున 'నావాళ్లే ఇలా అంటే ఎలా రా..?' అంటూ కాజల్ ని ఇమిటేట్ చేశారు. దానికి హౌస్ మేట్స్ అంతా పడి పడి నవ్వారు.
సిరి సేఫ్, ప్రియాంక ఎలిమినేట్: నామినేషన్ లో ఉన్న సిరి, ప్రియాంకల ముందు చిన్న కొండలు పెట్టారు. గ్లాస్ తో సొల్యూషన్ ఇచ్చి ఆ కొండలపై పోయమన్నారు. అందులోసిరికి గ్రీన్ కలర్ రావడంతో ఆమె సేఫ్ అయింది. ప్రియాంక ఎలిమినేట్ అయింది.
హౌస్ నుంచి వెళ్లిపోతూ.. మానస్ కి సారీ చెప్పింది. 'నిన్ను హర్ట్ చేస్తున్నానని తెలిసినా.. కూడా అలా అయినా నాతో మాట్లాడతావ్ అని చేశాను' అని రీజన్ చెప్పింది ప్రియాంక. మానస్ ని కౌగిలించుకొని ఏడ్చేసింది. నాతో ఈ వీక్ సరిగ్గా ఉండాల్సిందని మానస్ ని అడిగింది.
స్టేజ్ పైకి వచ్చిన ప్రియాంక.. హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి మాట్లాడింది. సిరిని ఫస్ట్ టైం చూసినప్పుడు.. ఈ అమ్మాయేంటి నాకంటే అందంగా ఉందని అనుకున్నాను. సిరిని చూస్తే నా చెల్లిని చూస్తున్నట్లే ఉంటుందని చెప్పింది. ఈ హౌస్ కి ఆమె చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. శ్రీరామచంద్ర గారితో ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యాను. ఆ బాండ్ అలానే ఉందని చెప్పింది. శ్రీరామ్ ని శ్రీకృష్ణుడి చేద్దామనుకున్నా.. కానీ ఆయన శ్రీరాముడిలానే ఉన్నారని చెప్పింది. షణ్ముఖ్ పక్కింటి కుర్రాడిలా ఉంటాడని చెప్పింది. సన్నీతో స్టార్టింగ్ లో బాండింగ్ లేదు.. కానీ రాను రాను తను ఉంటే ధైర్యంగా ఫీల్ అయ్యేదాన్ని అని చెప్పింది. కాజల్ ఫస్ట్ నుంచి హౌస్ లో అల్లరి చేస్తూనే ఉందని చెప్పింది. మానస్ ని ఫస్ట్ డే చూసినప్పుడు పలకరిస్తే తనను పట్టించుకోలేదని.. ఈ అబ్బాయ్ కి ఎంత పొగరని అనుకున్నానని చెప్పింది. ఆ తరువాత బాగా కనెక్ట్ అయిపోయాడని చెప్పింది. 'నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నువ్ గెలవడమే నేను ఎక్స్ పెక్ట్ చేస్తున్నా' అని మానస్ కి ఎమోషనల్ గా చెప్పింది ప్రియాంక. ఆ తరువాత 'ఉప్పెనంత ఈ ప్రేమకు' అనే పాటను ప్రియాంక కోసం పాడాడు మానస్.
Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి