స్టార్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు (ఆదివారం, డిసెంబర్ 5న) ఆమె తండ్రి సుదర్శన్ రావు కాస్బా తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన మృతికి క్యాన్సర్ కారణం అని తెలుస్తోంది. అనసూయ తండ్రి ఒకప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. కొన్నాళ్లు (సుధీర్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు) యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా సేవలు అందించారు. సుదర్శన్ రావు మృతితో అనసూయ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వెండితెర, బుల్లితెరకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ రావు స్వస్థలం నల్గొండ. అంత్యక్రియలకు అక్కడికి తీసుకు వెళతారా? లేదా హైదరాబాద్‌లో నిర్వహిస్తారా? అనేది ఇంకా నిర్ణయించలేదు.


సుదర్శన్ రావుకు అనసూయ తొలి సంతానం. ఆమెకు ఓ చెల్లెలు కూడా ఉన్నారు. ఎంబీఏ చేసిన అనసూయ, ఆ తర్వాత కొన్నాళ్లు హెచ్ఆర్‌గా ఓ కంపెనీలో ప‌ని చేశారు. ఆ తర్వాత న్యూస్ రీడర్, యాంక‌ర్‌గా మారారు. 'జబర్దస్త్' ఆమెకు ఫేమ్ తీసుకొచ్చింది. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చారు. 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర, అంతకు ముందు 'క్షణం'లో ఏసీపీ భరద్వాజ్ పాత్ర ఆమెకు పేరు తీసుకొచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప'లో అనసూయ డిఫరెంట్ రోల్ చేశారు. ఇంకా 'ఆచార్య', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్' సినిమాల్లో ఆమె చేతిలో ఉన్నాయి.
శ‌శాంక్ భ‌ర‌ద్వాజ్‌ను అన‌సూయ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.





Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..
Also Read: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి