కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా మంది సౌత్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడ హిట్ అయిన కొన్ని సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. ఈ మధ్యకాలంలో రీమేక్ ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏదైనా సినిమా భారీ విజయం అందుకుంటే చాలు.. వెంటనే బాలీవుడ్ లో రీమేక్ అయిపోతుంది. ఇప్పుడు 'జెర్సీ', 'అల.. వైకుంఠపురములో' లాంటి పేరున్న తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. 


ఇప్పుడు బాలయ్య సినిమా కూడా బాలీవుడ్ కు వెళ్తుందని సమాచారం. ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇలాంటి సినిమాలొస్తే బాలీవుడ్ నిర్మాతలు అసలు ఆలస్యం చేయకుండా.. రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. ఇప్పుడు వారి దృష్టి 'అఖండ' సినిమాపై పడింది. సినిమాలో కథ పెద్దగా లేనప్పటికీ.. 'అఘోరా' క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండడంతో దానికి బాలీవుడ్ టచ్ ఇవ్వాలనుకుంటున్నారు. 


సాజిద్ నడియాడ్ వాలా లాంటి నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయాలనుకుంటున్నారు. గత రెండు రోజులుగా 'అఖండ' సినిమా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. చాలా మంది నార్త్ జనాలు ఈ సినిమాలో హిందుత్వాన్ని బాగా చూపించారని.. సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ లో హిందూయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు రావడంతో.. సౌత్ ఇండస్ట్రీని చూసి నేర్చుకోమంటూ కౌంటర్లు వేస్తున్నారు నార్త్ ఆడియన్స్. 


దీంతో ఇప్పుడు 'అఖండ' పాత్రను తీసుకొని.. మిగతా కథలో కొంచెం మార్పులు జోడించి కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు. ఈ సినిమాలో హీరోగా అజయ్ దేవగన్ లేక.. అక్షయ్ కుమార్ లాంటి హీరోలను తీసుకోవాలని భావిస్తున్నారు. కొందరు బీజేపీ నేతలు సైతం ఈ సినిమా రీమేక్ కి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 


Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్


Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్


Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...


Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..


Also Read: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి