జగిత్యాల జిల్లాలోని మోహన్ రావు పేట శివారు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ వెళ్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో ఈ దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలివీ..
కారు - ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు డ్రైవర్ మరణించారు. కోరుట్ల మోమిన్ పురకు చెందిన దంపతులు, వారి
ముగ్గురు పిల్లలు అనస్, అర్షద్, అజాహన్‌తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్షద్, అజాన్ మృతి చెందారు. వారితో బాటు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందాడు. మరో బాలుడు అనస్ పరిస్థితి విషమంగా ఉంది. భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన డ్రైవర్‌ను సాజిద్ అలీ అనే 45 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో చిన్నారి కూడా అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో దుర్మరణం చెందింది. కోరుట్ల ఇంకా 10 కిలో మీటర్ల దూరంలో ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు.
Also Read: Sand Theft Detection: వారెవ్వా.. ఇసుక మాఫియాను అరికట్టే పరికరం కనిపెట్టిన విద్యార్థిని
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..
Also Read: East Godavari Crime: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి రవాణా... పోలీసులకు ఎలా చిక్కారంటే..?
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
Also Read: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లల్ని హత్య చేసిన వైద్యుడు... టీలో మత్తు మందు పెట్టి ఆపై దారుణంగా హత్య