బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండడంతో ప్రేక్షకులు ఆసక్తినా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో సినిమా పేర్లు ఇచ్చి.. అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలని అన్నారు నాగార్హున. ప్రియాంక 'మహానటి' అని.. 'అర్జున్ రెడ్డి' సన్నీ అని, శ్రీరామ్ రేలంగి మావయ్యా అని, మానస్ 'అపరిచితుడు'గా హౌస్ మేట్స్ ఎంపిక చేశారు. 


ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్స్ కి కొన్ని సినిమా పాటలు ఇచ్చి, నోట్లో నీళ్లు వేసుకొని ఆ పాట పాడమని చెప్పారు. వాళ్లు పాడలేక పడ్డ ఇబ్బందులు నవ్వులు పూయించాయి. ఆ తరువాత డైస్ తో ఓ గేమ్ ఆడించారు. ఇందులో సన్నీకి పనిష్మెంట్ రావడంతో 'ఎపిసోడ్ అయ్యేవరకు లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేసుకొని ఉండాలని' నాగార్జున చెప్పారు. 


దీంతో కాజల్, ప్రియాంక.. సన్నీకి మేకప్ వేశారు. ఆ గెటప్ లో సన్నీ ఎంతో ఫన్నీగా కనిపించాడు. ఆ తరువాత మానస్ కి క్వశ్చన్ రావడంతో.. 'ఈ ఇంట్లో సింపతీ సీకర్ ఎవరని' అడిగారు నాగార్జున. దానికి మానస్.. కాజల్ పేరు చెప్పాడు. దానికి నాగార్జున 'నావాళ్లే ఇలా అంటే ఎలా రా..?' అంటూ కాజల్ ని ఇమిటేట్ చేశారు. దానికి హౌస్ మేట్స్ అంతా పడి పడి నవ్వారు.