బిగ్ బాస్ సీజన్ 5లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. మొదటి వీక్ నుంచే తన ఆటను మొదలెట్టేశారు రవి. తన స్ట్రాటజీలతో గేమ్ బాగా ఆడుతున్నారు. అలానే తన ఫన్నీ కామెంట్స్ తో నవ్విస్తుంటారు. హౌస్ లో అందరినీ మానిప్యులేట్ చేస్తూ.. చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటివరకు ప్రసారమైన మొత్తం తొమ్మిది వారాల్లో.. రవి ఎనిమిదివారాలుగా నామినేషన్ లో ఉంటున్నారు. ఈ వారం కూడా అతడిని నామినేట్ చేశారు హౌస్ మేట్స్. 


Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?


ఈ వారం గనుక సేవ్ అయితే వచ్చే వారం అతడికి ఇమ్యూనిటీ దొరకడం ఖాయం. ఎందుకంటే.. రవి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యానీ, షణ్ముఖ్, సిరి,  శ్రీరామచంద్ర, సన్నీ, జెస్సీ, విశ్వ(రెండు సార్లు)లకు కెప్టెన్ గా అవకాశం వచ్చింది. ఈసారి రవి ఆ బ్యాండ్ పెట్టుకోబోతున్నాడు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. 


ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతారని చెప్పారు. ఇదే సమయంలో రవికి సీక్రెట్ టాక్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి గెలిచినట్లు ఉన్నారు. అందుకే అతడికి కెప్టెన్సీ టాస్క్ ఆడే ఛాన్స్ వచ్చింది. ఈ టాస్క్ లో రవి గెలవడంతో కెప్టెన్ గా నిలిచాడు. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ టైటిల్ ఎవరికి ఇచ్చారనే విషయంలో సిరి పేరు వినిపిస్తోంది. 


హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది సిరికి ఓట్లు వేశారట. టాస్క్ లో ఆమె సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని.. షణ్ముఖ్ చుట్టూనే తిరుగుతుందని.. టిప్స్ కూడా షణ్ముఖ్ కి ఒక్కడికే ఇచ్చిందని రీజన్స్ చెప్పారట హౌస్ మేట్స్. సిరి మాత్రం తను వరస్ట్ పెర్ఫార్మర్ కాదని.. టాస్క్ లో 100% ఆడానని వాదించిందట. అయినప్పటికీ ఆమెనే వరస్ట్ పెర్ఫార్మర్ గా ఫైనల్ చేసిన జైలుకి పంపించారట. బెస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.  




 



Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్


Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా


Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!


Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?



Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి