Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే వీక్‌లోకి టాప్ 6 కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. అయితే ఈ వారమంతా వారు ఎలాంటి గొడవలు పడే అవసరం లేకుండా టాస్కులు పెట్టడమే ఆపేశారు బిగ్ బాస్. అంతే కాకుండా ఎవరి జర్నీని వారికి చూపించి, కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఇన్‌స్పైర్ చేస్తున్నారు. చివరి వారం కావడంతో కంటెస్టెంట్స్ అందరి గురించి గొప్పగా చెప్పి వారితో కన్నీళ్లు పెట్టిస్తున్నారు బిగ్ బాస్. ఈ ఒక్క వారం తర్వాత కంటెస్టెంట్స్ అందరి జీవితాల్లో బిగ్ బాస్ అనే చాప్టర్ ముగిసిపోవడంతో ఎవరి మధ్య మనస్పర్థలు ఉన్నా అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకే అర్జున్ కూడా యావర్‌కు.. తనకు మధ్య ఉన్న గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.


మనసు మార్చుకున్న అర్జున్..
కొన్ని వారాల క్రితం జరిగిన నామినేషన్స్‌లో యావర్‌కు, అర్జున్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడిన సమయంలో యావర్ ఆడిన ఫౌల్ గేమ్ వల్ల అర్జున్‌కు పాస్ దక్కలేదు. అదే కారణంగా చెప్పి అర్జున్‌ను నామినేట్ చేశారు అర్జున్. అది నచ్చని యావర్.. అర్జున్‌ను సిల్లీ కారణం చెప్పి రివర్స్ నామినేషన్ వేశాడు. అది అర్జున్‌కు నచ్చలేదు. దీంతో తన గురించి ఎప్పుడు మంచిగా అనుకునేవాడని, కానీ ఇప్పటినుంచి హౌజ్‌లో ఉన్నంతవరకు తనతో మాట్లాడడం జరగదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మామూలుగా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్‌లో గొడవపడడం, ఆ తర్వాత కలిసిపోవడం సహజమే. కానీ అర్జున్ మాత్రం తన మాట మీద నిలబడి ఇప్పటివరకు యావర్‌తో మాట్లాడలేదు. దీంతో యావర్‌కు కూడా సహనం పోయింది. గతవారం జరిగిన టాస్కుల సమయంలో ఇక అర్జున్‌ను అన్న అనుకోను అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తన జర్నీని చూసొచ్చిన తర్వాత అర్జున్ మనసు మారింది.


ఎమోషనల్ అయిన యావర్..
అర్జున్ ఆట గురించి, హౌజ్‌లో తన ప్రయాణం గురించి వీడియో చూపించాడు బిగ్ బాస్. ఇక అమర్‌దీప్, అర్జున్, శివాజీ జర్నీ వీడియోలను చూసొచ్చిన తర్వాత కిచెన్‌లో వంట చేసుకుంటున్నారు. అదే సమయంలో తన వీడియో తనకు బాగా నచ్చిందని చెప్తూ యావర్‌ను వచ్చి హత్తుకున్నాడు అర్జున్. దీంతో యావర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి అర్జున్‌ను తిరిగి హగ్ చేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఇదంతా పక్కనే ఉండి చూసిన శివాజీ, పల్లవి ప్రశాంత్ మురిసిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఇంకా ఎవరికీ ఏ మనస్పర్థలు లేకుండా కలిసిమెలిసి ఉండడానికే ప్రయత్నిస్తున్నారు.


జనాల హృదయాలు గెలవడం ముఖ్యం..
బిగ్ బాస్ హౌజ్‌లో తన జర్నీని చూసుకున్న తర్వాత శివాజీ.. ‘‘గెలుస్తామా, గెలవమా అన్నది ముఖ్యం కాదు. జనాల హృదయాలు గెలవడం ముఖ్యం. అది నేను చేశానని కచ్చితంగా నమ్ముతున్నాను’’ అని చెప్పాడు. తన జర్నీ చూసుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక కూడా తన జర్నీని చూసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఫైనల్స్ దగ్గర పడుతున్నకొద్దీ ట్రోఫీ ఎవరు గెలుస్తారా, బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలయ్యింది.


Also Read: ఆయన కోసమే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చా, ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు: సత్యశ్రీ