Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా అని నాగార్జున ముందే చెప్పారు. అందుకే సీజన్ 7 ప్రారంభమయిన అయిదు వారాల తర్వాత 2.0 అంటూ కొత్తగా లాంచ్ చేసి మరో అయిదుగురు కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించారు. అలాగే సింగర్ భోలే షావలి, సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ అశ్విని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లారు. వారితో పాటు అర్జున్, పూజా, నయని పావని కూడా బిగ్ బాస్ సీజన్ 7లో కొత్త కంటెస్టెంట్స్ అయ్యారు. కానీ వీరిందరిలో అర్జున్ తప్పా మిగతా వారందరూ ఎలిమినేట్ అయిపోయారు. ముఖ్యంగా భోలే షావలి, అశ్విని.. చాలా క్లోజ్‌గా ఉండేవారు. అయినా కూడా అశ్విని ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చినప్పటి నుంచి భోలేను ఒక్కసారి కూడా కలవలేదు. తాజాగా కలిసి తను షేర్ చేసిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది.


బిగ్ బాస్‌ను లైట్ తీసుకున్న భోలే..
బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయినప్పటి నుంచి అశ్విని.. తనతో ఎవరూ మాట్లాడరని, తను వస్తే పక్కకు వెళ్లిపోతారని, అసలు మనిషిలాగా చూడరని.. ఇలా హౌజ్‌మేట్స్ అందరి మీద ఎన్నో ఫిర్యాదులు చేసింది. కానీ ఏ కంప్లయింట్ చేయకుండా భోలే షావలితో మాత్రమే క్లోజ్‌గా ఉండేది. ఎన్నో సందర్భాల్లో ‘నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంకా ఈ హౌజ్‌లో ఉండగలుగుతున్నాను’ అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఇక హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా అశ్వినితోనే ఫ్లర్టింగ్ మొదలుపెట్టాడు భోలే. అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ఎంటర్‌టైన్మెంట్‌లో మాత్రమే యాక్టివ్ ఉంటూ.. బిగ్ బాస్ టాస్కులను లైట్ తీసుకోవడంతో భోలే.. ముందుగా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు.


ఫైనల్‌గా భోలేతో మీటింగ్..
భోలే షావలి ఎలిమినేషన్ అప్పుడు కూడా ‘నువ్వు లేకుండా హౌజ్‌లో ఉండలేను. నేను కూడా వచ్చేస్తాను’ అని ఏడవడం మొదలుపెట్టింది అశ్విని. అందుకేనేమో ప్రేక్షకులు.. తనను కూడా ఎక్కువరోజులు భరించలేక బయటికి పంపించేశారు. మూడు వారాల క్రితం జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో రతికతో పాటు అశ్విని కూడా ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్ సమయంలో ఎవరినీ నామినేట్ చేయడానికి తన దగ్గర ఏ కారణం లేదని చెప్పి.. తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది అశ్విని. ఆ సెల్ఫ్ నామినేషనే తన కొంపముంచింది. ఇక ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే హాలిడేకు బయల్దేరింది ఈ డింపుల్ బ్యూటీ. అన్ని ప్రయాణాలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఫైనల్‌గా భోలేను కలిసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాకపోతే క్యాప్షన్‌తో భోలేకు షాక్ ఇచ్చింది.


భోలే అన్నయ్య..
భోలే షావలి, అశ్విని కలిసి వనభోజనాలకు వెళ్లారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలను, వీడియోలను అశ్విని.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘అన్నయ్య అనేవాడు స్పిరిట్‌కు ఫ్రెండ్‌లాగా, మనసుకు గిఫ్ట్‌లాగా ఉంటారు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబినేషన్ వచ్చేసింది’’ అని క్యాప్షన్‌లో భోలేను అన్నయ్య అనేసింది అశ్విని. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతవరకు వీరిద్దరూ అన్న, చెల్లెల్లుగా ఎప్పుడూ లేరు. ఎప్పుడూ ఒకరినొకరు ఫ్లర్ట్ చేసుకుంటూ, సరదాగా ఉండేవారు. ఇక బయటికి రాగానే భోలేను అన్నయ్య అనాలనిపించిందా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 






Also Read: గుడ్ న్యూస్ షేర్ చేసిన గీతా మాధురి, అసలు విషయం చెప్పేసిందిగా!