Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు, ట్రోఫీ ఎవరి సొంతం అవుతుంది తెలుసుకోవడానికి కనీసం వారం రోజులు కూడా లేదు. అందుకే ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఆరుగురి ఫ్యాన్స్.. తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఓటింగ్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ‘స్పై’ (Shivaji, Pallavi Prashanth, Yawar) బ్యాచ్, ‘స్పా’ (Shobha Shetty, Priyanka, Amardeep) బ్యాచ్ అని రెండు గ్రూపులు ఉండగా.. ఇటీవల శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వడంతో ‘స్పా’ బ్యాచ్‌లో ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలారు. అయితే ఓటింగ్ విషయంలో శివాజీ, పల్లవి ప్రశాంత్‌తో పోటీపడుతున్న అమర్‌దీప్‌కు ‘స్పై’ బ్యాచ్ ఓట్లే ప్లస్ అవ్వనున్నాయని అర్థమవుతోంది.


స్పై బ్యాచ్ ఓట్లలో చీలికలు..
ప్రస్తుతం ఫైనల్ ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మెల్లగా అమర్‌దీప్ కూడా ఓటింగ్ విషయంలో ఈ స్పై బ్యాచ్‌తో పోటీ పడుతున్నాడు. అయితే మామూలుగా శివాజీకి సపోర్ట్ చేసే ప్రేక్షకులు ఎవరైనా కూడా యావర్, ప్రశాంత్‌లకు కూడా సపోర్ట్ చేస్తారు. దీంతో ఓట్లు చీలుతాయి. స్పై బ్యాచ్‌లో ఒకరికి సపోర్ట్ చేయాలనుకునే ప్రేక్షకులు.. మిగతా ఇద్దరికీ కూడా ఓట్లు వేస్తే బాగుంటుందని భావిస్తారు. దీని కారణంగా ఓటింగ్ విషయంలో ముగ్గురు సమానం అవుతారు. అదే సమయంలో అమర్‌దీప్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌లో కొందరు ప్రియాంకకు ఓట్లు వేసినా.. అమర్‌కు మాత్రం ఎక్కువ ఓట్లే పడతాయి. ఈవిధంగా స్పై బ్యాచ్‌లో చీలిపోయే ఓట్లు అమర్‌దీప్‌కు ప్లస్ అవ్వనున్నాయి.


అమర్ విన్నర్ అవ్వాలన్న శోభా..
ప్రియాంక, శోభా, అమర్‌దీప్.. ఒక గ్రూప్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆ గ్రూప్ నుంచి శోభా ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నప్పుడు కూడా అమర్‌నే కప్ కొట్టుకొని రమ్మని చెప్పింది శోభా. అంటే బయట నుంచి శోభా సపోర్ట్ కూడా అమర్‌దీప్‌కే ఎక్కువగా దక్కుతుంది. శోభాకు ఓటు వేయాలనుకున్నవారు చాలామంది ప్రియాంకకే ఓటు వేసినా కూడా అమర్‌కు కొన్ని ఓట్లు పడినా.. అది తనకు ప్లస్సే అవుతుంది. మొత్తంగా అమర్‌దీప్ ఓట్లు చీలిపోకుండా ఉండడం వల్ల తను టాప్ 3లో నిలిచే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్‌ను బట్టి చూస్తే పల్లవి ప్రశాంత్ టాప్ 1 స్థానంలో ఉన్నాడు. కానీ ఫైనల్స్‌కు ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఓటింగ్ రిజల్ట్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.


లీస్ట్‌లో ఆ ఇద్దరూ..
ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఓటింగ్ విషయంలో ప్రియాంక, అర్జున్ మాత్రమే లీస్ట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అర్జున్‌కు ఫినాలే అస్త్రా రాకపోయింటే.. తాను ఆ వారంలోనే ఎలిమినేట్ అయిపోయేవాడని నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎంత ఆడినా కూడా బలగం లేకపోతే ఓట్లు పడవని, విన్నర్ అవ్వడం కష్టం అని అర్జున్‌కు కూడా అర్థమయ్యింది. ఇక ప్రియాంక కూడా బాగా ఆడుతుందని, అందరు అబ్బాయిలతో పోటీపడి ఫైనల్స్ వరకు వెళ్లిందని చాలామంది ప్రేక్షకుల్లో తనపై పాజిటివ్ అభిప్రాయం ఉన్నా.. మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే తనకు ఓట్లు వేసే ఫ్యాన్స్ చాలా తక్కువ. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే.. ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పోలింగ్ చూస్తే అర్థమవుతోంది. ఒక వేళ ప్రియాంక తప్పుకుంటే అమర్ రూట్ క్లియర్ అవుతుంది. కాబట్టి అమర్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: ముంబాయ్‌లో ప్రియాంక ఇల్లు చూశారా? ఒక స్లమ్‌లో చిన్న రూమ్‌లో అంతమంది ఉండేవారా?