‘బిగ్ బాస్ 5’లో ఈ రోజు రచ్చ మామూలుగా ఉండదనిపిస్తోంది. వీజే సన్నీతో ప్రియా మాత్రమే కాదు.. ఈ సారి సిరి కూడా ఫైట్ చేస్తోంది. బుధవారం సాయంత్రం విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. అర్ధరాత్రి సన్నీ ఇతర సభ్యుల గుడ్లను కొట్టేసి.. మానస్ ఇస్తూ కనిపించాడు. జస్సీని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని సీక్రెట్ టాస్క్ ద్వారా ఇస్తున్నట్లు తెలిపాడు. అయితే, ఆ టాస్క్ ఏమిటనేది ప్రోమోలో చూపించలేదు. 


టాస్క్‌లో భాగంగా జస్సీకి, సన్నికి మధ్య ఫైట్ జరిగింది. వారి మధ్యలోకి సిరి దూరింది. ఇందుకు ఆగ్రహించిన సన్నీ.. ‘‘నన్ను రా అని పిలివద్దు. నీకు ఆ అర్హత పోయింది. రా అనకు’’ అని సన్నీ అన్నాడు. ‘‘నువ్వు ఎవరు? అర్హత ఏమిటీ.. అర్హత’’ అని సిరి రెట్టించింది. ఈ సందర్భంగా జస్సీ, సన్నీ, సిరీల మధ్య పెద్ద వారే జరిగింది. గుడ్లు విషయంలో రవి.. సిరికి ఏదో ప్లాన్ చెప్పాడు. దీంతో సిరి, జస్సీ కలిసి మరేదో ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని షన్నుతో షేర్ చేసుకున్నారు. దీంతో షన్ను.. ఎంట్రా ఇది, బ్రహ్మకే షాకా అని అన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్.. జస్సీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇది విని ఇంటి సభ్యులు షాకయ్యారు. దీంతో షన్ను.. ‘‘బిగ్ బాస్ నాక్కూడా అప్పుడప్పుడు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి’’ అని అడిగాడు. దీంతో రవి ‘‘అరె ముందు టాస్క్ ఆడు’’ అని పంచ్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ ఇతర హౌస్‌‌మేట్స్ షన్నును చూసి నవ్వారు. దీంతో షన్ను అలిగాడు. ‘‘నేను మాత్రం మీ గురించి ఆలోచించాలి. మీరు మాత్రం నా గురించి ఆలోచించరు. నన్ను వెర్రిపప్పను చేశారు’’ అంటూ జస్సీ, సిరిపై షన్ను మండిపడ్డాడు. మరి, వీరి మధ్య గొడవకు స్పష్టమైన కారణం ఏమిటనేది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లోనే చూడాలి. 


ప్రొమో: 



ఉదయం విడుదలైన ప్రోమోలో..: ‘బంగారు కోడిపెట్ట’ గుడ్లు పెడుతున్న సమయంలో మౌస్‌మేట్స్ అంతా వాటిని కలెక్ట్ చేసుకోడానికి పరుగులు పెట్టారు. అంతా గుడ్లు సేకరించే పనిలో ఉండగా.. ప్రియా ‘‘నాకు బుట్ట దొరికింది..’’ అంటూ సన్నీ దాచుకున్న గుడ్ల సంచిని చింపేందుకు ప్రయత్నించింది. దీంతో సన్నీ ఆమెను అడ్డుకోవడం కోసం పక్కకు తోశాడు. ‘‘పిజికలైతే మర్యాదగా ఉండదు. చెంప పగిలిపోద్ది’’ అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. దీంతో సన్నీ.. ‘‘నోరు ఉందని పారేసుకోకు’’ అని గట్టిగా అరిచాడు. ‘‘ఇక్కడికి వచ్చి అన్నీ చింపేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా?’’ అని అడిగాడు. దీంతో ప్రియా సన్నీ గుడ్ల సంచిని తీసుకుని చింపేసింది. ‘‘నా గేమ్ ఇదే. మీరు దొంగతనం చేస్తే దొంగతనం కాదు. కష్టపడి ఆడినట్లు. అర్ధరాత్రి వచ్చి దొంగతనం చేస్తే’’ అని ప్రియా అనడంతో సన్నీ.. ‘‘ఏయో’’ అని అరిచాడు. దీంతో ప్రియా మరింత కోపంతో.. ‘‘ఏయ్ ఏంటీ ఏయ్..’’ అంది. ‘‘ఆట చేతకాదు.. చేతకాని ముఖాలు వస్తారు ఇక్కడికి’’ అని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ప్రియా స్పందిస్తూ.. ‘‘పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది చెబుతున్నా..’’ అని మరోసారి సన్నీని హెచ్చరించింది. దీంతో సన్నీ.. ‘‘దమ్ముంటే కొట్టి చూడు’’ అని ప్రియా మీదకు వెళ్లాడు. ‘‘నన్ను టచ్ చేసి చూడు’’ అని ప్రియాంక.. సన్నీని మరింత రెచ్చగొట్టింది. చూస్తుంటే.. ఈ రోజు బిగ్ బాస్‌కు కావలసిన కంటెంట్ దొరికిందేమో అనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూసే అవకాశాలు బాగానే ఉన్నాయి. 


Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'



Also Read: అక్కినేని బ్రదర్స్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...


Also Read:  బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ తేదీ ఖరారు.. మరో వీడియో వదిలిన ‘ఆహా’


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి