కరోనా బారిన పడుతున్న బాలీవుడ్ తరాల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఆల్రెడీ కరీనా కపూర్ ఖాన్‌కు, అమృతా అరోరాకు కరోనా వచ్చి తగ్గింది. రీసెంట్‌గా అర్జున్ కపూర్, ఆయన సోదరి అన్షులా కపూర్ కరోనా బారిన పడ్డారు. అంతకు ముందు అర్జున్ కజిన్ రియా కపూర్ సైతం తనకు కరోనా అని వెల్లడించారు. లేటెస్టుగా ఈ లిస్టులోకి 'బాహుబలి' ఐటమ్ గాళ్ నోరా ఫతేహి కూడా చేరారు.
'బాహుబలి' కంటే ముందు 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం...' పాట చేశారు నోరా ఫతేహి. 'బాహుబలి' తర్వాత 'కిక్ 2', 'షేర్', 'లోఫర్', 'ఊపిరి' సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు. ప్రస్తుతం హిందీ సినిమాల్లో క్యారెక్టర్స్, స్పెషల్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారు. తాను కరోనా బారిన పడినట్టు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నోరా ఫతేహి వెల్లడించారు.
Also Read: Tollywood Year Ender 2021: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
"హాయ్! దురదృష్టవశాత్తూ... నేను కొవిడ్‌తో పోరాటం చేస్తున్నాను. కొన్ని రోజులుగా నేను మంచానికి పరిమితం అయ్యాను. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. దయచేసి అందరూ మాస్క్ లు ధరించండి. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్" అని నోరా ఫతేహి పేర్కొన్నారు.







Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read:ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్... ఇద్దరి మధ్య గొడవ ఏంటి!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి