Avatar 2 Box Office Collection Day 1 India : 'అవతార్ 2' సినిమాకు ఇండియాలో ఫస్ట్ డే ఫెంటాస్టిక్ ఓపెనింగ్ లభించింది. అందులో మెజారిటీ వాటా మన తెలుగు రాష్ట్రాలదే. ఇంతకు ముందు ఏ హాలీవుడ్ సినిమా కూడా కలెక్ట్ చేయలేని విధంగా తెలుగులో 'అవతార్ 2' బాక్సాఫీస్ బరిలో వసూళ్ళ సునామి సృష్టించింది. ఒక్క తెలుగు కాకుండా ఇండియాలో ఓపెనింగ్ డే రికార్డు తన పేరిట లిఖించుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. అసలు, ఇండియాలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే....
 
ఇండియాలో 'అవతార్ 2' @ 40 కోట్లు
Avatar The Way Of Water Collection : ఇండియాలో 'అవతార్ 2' శుక్రవారం సుమారు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ. 38. 50 నుంచి రూ. 40. 50 కోట్ల మధ్య ఉంటుందని అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో ఈ ఏడాది విడుదలైన హాలీవుడ్ సినిమాలు చూస్తే... హయ్యస్ట్ ఓపెనింగ్ డే 'అవతార్ 2'దే అని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే... రెండో స్థానంలో ఉంది.

  


ఫస్ట్ ప్లేసులో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' 'అవతార్ 2' కంటే ముందు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన యాక్షన్ విజువల్ వండర్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఉంది. ఆ సినిమా 2019లో విడుదల అయ్యింది. అప్పట్లో ఫస్ట్ డే రూ. 53.10 కోట్లు వసూలు చేసింది. దాని కంటే పది పన్నెండు కోట్ల వెనుకే 'అవతార్ 2' ఉంది. ఇప్పట్లో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' రికార్డ్ ఎవరూ బీట్ చేయలేరేమో!?


తెలుగులో 'అవతార్ 2' అదరహో
'అవతార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి చూపించారు. ఇండియాలో బుక్ అయిన మొత్తం టిక్కెట్లలో సగం టిక్కెట్లు తెలుగు రాష్ట్రాల నుంచి బుక్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. 


Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి? 


ఏపీ, తెలంగాణలో 'అవతార్ 2' సినిమా మొదటి రోజు రూ. 13.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనికి ముందు హయ్యస్ట్ ఓపెనింగ్ వచ్చిన హాలీవుడ్ సినిమా ఏదో తెలుసా? 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్'కు. ఆ సినిమా రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ రికార్డును 'అవతార్ 2' డబుల్ మార్జిన్‌లో బీట్ చేసింది. ఇప్పట్లో 'అవతార్ 2' రికార్డును మరో హాలీవుడ్ సినిమా బీట్ చేయడం కష్టమే.
 
వీకెండ్ వరకు తెలుగులో సూపర్!
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ వరకు ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా బావుంటుందని చెప్పాలి. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఫుల్స్ అవుతున్నాయి. తెలుగు దాటితే కలెక్షన్స్ విషయంలో కొంత అటు ఇటు ఊగిసలాట ధోరణి కనబడుతోంది. ఉత్తరాది ప్రేక్షకులు సినిమాపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఆల్రెడీ హెచ్‌డి ప్రింట్ పైరసీలో అందుబాటులో ఉండటం, విజువల్స్ తప్ప సినిమా కథలో దమ్ము లేదని విమర్శలు రావడం వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి... 'అవతార్ 2' లాంటి సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ అనుభూతి చెందుతాం. పైరసీలో చూస్తే విజువల్స్ చేసే మేజిక్ అర్థం కాదు.



Also Read : మినీ సిరీస్ రివ్యూ : నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ