అయ్యప్ప స్వాములకు తెలంగాణ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. శబరి యాత్రకు  ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాదు వాళ్లకు ప్రయాణ ఛార్జీలపై మరో పది శాతం రాయితీ కూడా ఇస్తోంది.


అయ్యప్ప మాల వేసిన స్వాములు శబరి యాత్రకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. సరిపడా రవాణా సౌకర్యాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్వాములు ఎక్కువ మంది ట్రైన్ జర్నీ చేయడానికే ఇష్టపడతారు. చాలా దూరం  ప్రయాణం చేయాలి కాబట్టి... రైలులో వెళ్తేనే సురక్షితం, సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తారు. అందుకే రైళ్లు స్వాములతో కిక్కిరిసిపోతున్నాయి. రిజర్వేషన్లు దొరక్క చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 


ఇలాంటి పరిస్థితి చూసిన తెలంగాణ ఆర్టీసి ముందుకొచ్చిది. శబరిమలకు బస్సులు నడిపేందుకు సన్నద్ధమైంది. ప్రత్యేక బస్సులు వేస్తున్నట్టు ప్రకటించింది. అందులో ప్రయాణించే భక్తులకు పది శాతం రాయితీ కూడా ఇస్తోంది. స్వాములకు నచ్చిన రూట్‌లో తీసుకెళ్లేందుకు కూడా ఓకే అంటోంది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వరకు ఉన్న అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. 






శబరియాత్ర కోసం టీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సులు కావాలనుకునే వాళ్లు 24/7 పని చేసే కాల్ సెంటర్ 040-23450033, 69440000కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.






సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం కూడా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.