ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వచ్చే పశ్చిమ దిశగా కదులుతోంది. రాగల 12 గంటల్లో నికోబార్ దీవుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం మీద డిసెంబర్ 17 ఉదయం వరకు 35-45 kmph నుంచి 55 kmph వేగంతో గాలులు వీచే వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 17 ఉదయం వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 35-45 కి.మీ వేగంతో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 17న నైరుతి బంగాళాఖాతంలో గంటకు 35-45 కి.మీ వేగంతో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 17 ఉదయం వరకు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితి అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖాధికారులు సూచించారు.
ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రాంతం వచ్చే వారానికి బలపడొచ్చని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు. దీని ఫలితంగా వచ్చే వారం చివరిలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. ఆ అల్పపీడనం వెళ్లే మార్గంపై ఇంకా క్లారిటీ రాలేదని వచ్చాక ఎక్కడ వర్షాలు పడొచ్చనేది స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి వర్షసూచన లేదన్నారు. వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి కర్నూలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. ఉత్తర భారత దేశం నుంచి వీచే గాలులు కారణంగా చలి తీవ్రత వారం రోజుల పాటు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. తిరుపతి, కడప, నెల్లూరు పరిసరాల్లో అంతగా ఉండకపోవచ్చన్నారు. సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులు కారణంగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉండదన్నారు.
వచ్చే వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్. బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుందన్నారు. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా వేయలేదని తెలిపారు. దీని కోసం ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ రానుంది. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుందని అంచనా. 1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదన్నారు. 2) వెష్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉందని అభిప్రాయపడ్డారు.
పశ్చిమ మధ్య ఉన్న ఈస్ట్‌సెంట్రల్ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం గంటకు 14 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది అమినీదీవికి (లక్షద్వీప్) పశ్చిమ-వాయువ్యంగా 1100 కి.మీలో కేంద్రీకృతమై ఉంది. డిసెంబర్ 17 సాయంత్రం అంటే ఈ సాయంత్రానికి ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగాా మారిపోనుంది.
అల్పపీడనం భారత తీరానికి దూరంగా కదులుతున్నందున హెచ్చరికం ఏమీ లేవు. తూర్పు మధ్య అరేబియా సముద్రం... డిసెంబర్ 17 ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉండి, ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రం డిసెంబర్ 17 సాయంత్రం వరకు అల్లకల్లోలంగా ఉండి ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. నైరుతి అరేబియా సముద్రం డిసెంబర్ 17 సాయంత్రం వరకు సముద్ర పరిస్థితి ఉద్ధృతంగా ఉండి ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖాధికారులు సూచించారు.