బాంబే హైకోర్టులో బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించాలని కోరుతూ ఎన్‌సీబీ కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ఉందని, దీన్ని బట్టబయలు చేసేందుకు ఎన్‌సీబీకి మరికొంత సమయం కావాలని అఫిడవిట్‌లో పేర్కొంది.


ఆర్యన్ ఖాన్ బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్‌సీబీ వెల్లడించింది. సాక్షలును, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. 


కౌంటర్ అఫిడవిట్..


అయితే దీనిపై ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్యన్ ఖాన్‌కు ఈ డ్రగ్స్ కేసులో సాక్ష్యులుగా పేర్కొంటున్న ప్రభాకర్ సాలి, కిరణ్ గోసవీకి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. కనుక ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాలని ప్రమాణపత్రంలో కోరారు. మరోవైపు ఇందులో కీలక సాక్షిగా చెబుతోన్న కిరణ్ గోసవీ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆయన చివరి లోకేషన్ మాత్రం ఫరీదాబాద్‌గా పోలీసులు గుర్తించారు.


ఇదీ కేసు..


ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 


ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. 


విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.


Also Read: Compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి