డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ మాత్రం ఇంకా హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ ట్రైలర్.. యూట్యూబ్‌లో భలే ట్రెండవ్వుతోంది. తాజాగా విడుదల చేసిన మరో ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్ సైతం అదేస్థాయిలో దూసుకెళ్తోంది. ఈ వీడియోను పోస్టు చేసిన 24 గంటల్లోనే వ్యూస్ ఒక మిలియన్ వ్యూస్‌తో నెంబర్ 3గా ట్రెండవ్వుతోంది.
ఇటీవల పూరీ, చార్మీ కౌర్‌లు రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో చిత్రయూనిట్ తాజాగా ఆకాష్ పూరీ డైలాగులతో బదాస్ ట్రైల్‌ను విడుదల చేశారు. దీనికి సునీల్ కాశ్యప్ అందించిన అదిరిపోయే సంగీతం మరింత ఊపునిస్తోంది. చూస్తుంటే.. ఈ చిత్రంతో ఆకాష్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. రమ్యకృష్ణ, కేతిక శర్మ పాత్రలు సైతం ఆకట్టుకొనేలా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి.
Also Read: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!
ఈ చిత్రం షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ, కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో చిత్రాన్ని అక్టోబరు 29న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇస్తున్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఈ చిత్రంతో కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన తదితరలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?