ఇటీవలే థియేటర్లో విడుదలైన శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా నటించిన ‘అర్జున ఫల్గుణ’ చిత్రం.. త్వరలోనే ఆన్‌లైన్‌లో సందడి చేయనుంది. ఓటీటీ వేదికగా ఈ చిత్రం బుల్లితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది.


తేజమర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అర్జున్ (శ్రీ విష్ణు)ది గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరు. అతడు డిగ్రీ చదివాడు. కానీ, ఉద్యోగం గట్రా ఏమీ చేయడు. ఉదయాన్నే పాలు పోయడం, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పడం, ప్రేమించిన అమ్మాయితో కలిసి తిరగడం... అతడు చేసేది అంతే! అయితే... స్నేహితుల్లో ఒకరి తండ్రి వ్యవసాయం కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో ఇల్లు జప్తు చేయడానికి అధికారులు వస్తారు. ఓసారి అర్జున్ అడ్డుకుంటాడు. తర్వాత స్నేహితుల అప్పులు తీర్చడానికి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి అంగీకరిస్తాడు. ఆ నిర్ణయం వల్ల ఎన్ని తిప్పలు ఎదుర్కొన్నారు? ఎటువంటి అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది? అనేది మిగతా సినిమా. హాస్య సన్నివేశాలతో తప్పకుండా కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం జనవరి 26 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ చిత్రం ‘అఖండ’ ఈ నెల 21 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది.






‘బంగార్రాజు’ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?


రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..


Also Read: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..


Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?


Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..


Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..


Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి