Naa Saami Ranga Worldwide Box Office Collection Day 5: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది. ప్రస్తుతం బాక్సాపీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 


5 రోజుల్లో రూ. 35 కోట్లు వసూళు చేసిన ‘నా సామిరంగ’  


సంక్రాంతి సెలవులు ఉండటం, ఫ్యామిలీ, ఎమోషనల్ తో నిండిన మూవీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తారు. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా బాగానే ఆడుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే నా సామిరంగ మూవీ 5 రోజుల్లో రూ.18.17 కోట్ల షేర్ రాబట్టింది. ‘నా సామిరంగ’ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.4 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.  


తెలుగు రాష్ట్రాల్లో ‘నా సామిరంగ’ 5వ రోజు కలెక్షన్స్


నైజాంలో – 61 లక్షలు


సీడెడ్ – 44 లక్షల


వైజాగ్ – 41 లక్షలు


ఈస్ట్ – 34 లక్షలు


వెస్ట్ – 17 లక్షలు


కృష్ణ – 19 లక్షలు


గుంటూరు – 24 లక్షలు


నెల్లూరు – 14లక్షలు


5వ రోజు షేర్ – 2.54 కోట్లు


5 రోజుల్లో  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల షేర్– 18.17 కోట్లు


వరల్డ్ వైడ్ గ్రాస్ – 35.4 కోట్లు






‘నా సామిరంగ’తో హిట్ ట్రాక్ ఎక్కిన నాగార్జున


చాలా రోజుల తరువాత నాగార్జునకు ‘నా సామిరంగ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆయన, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. సంక్రాంతికి విడుదలైన నాగార్జున సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయనే సెంటిమెంట్ ఉంది. మరోసారి ఆ సెంటిమెంట్ నిజమేనని రుజువైంది. మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమాను తెరకెక్కించారు.  మూలకథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేశారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను నాగార్జున రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కింది. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.    


Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘గుంటూరు కారం‘, ఏంటీ షాకయ్యారా? ఇవిగో ప్రూఫ్స్