యూట్యూబర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో అతడి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో వలన అతడిపై కొంత నెగెటివిటీ వచ్చినప్పటికీ.. కెరీర్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఇప్పటికే యూట్యూబ్ లో పలు సిరీస్ లు చేసిన షణ్ముఖ్ కొన్ని రోజుల క్రితం 'ఆహా' ఓటీటీ సంస్థ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 


అదే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'(AAS). తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. నిమిషంన్నర సాగిన ఈ టీజర్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కట్ చేశారు. ప్రేమించిన అమ్మాయి ఫ్యామిలీని ఒప్పించడానికి వారి ఇంటికి వెళ్లిన హీరో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడుతూ ఇన్నోసెంట్ గా కనిపించాడు షణ్ముఖ్. తనొక డిటెక్టివ్ ఏజెంట్ అని.. మనసు తప్ప ఏదైనా వెతికిపెడతానని చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 


టీజర్ ని బట్టి చూస్తుంటే ఓ కేసుని చేధించే ప్రాసెస్ లో హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే కథ అని తెలుస్తోంది. అయితే సీరియస్ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా షణ్ముఖ్ కామెడీ యాంగిల్ లో చిత్రీకరించినట్లు ఉన్నారు. త్వరలోనే ఈ సిరీస్ ను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 


Also Read: ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని చితకబాదారు - సాయిపల్లవి కామెంట్స్


Also Read: నితిన్‌కు డ్యాన్స్ రాదు, నేనే నేర్పించా! ఈ రోజు నన్నే అవమానించాడు - అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్