UN on Indian Population: '2022 ప్రపంచ జనాభా అంచనాల' నివేదికను ఐక్యరాజ్యసమితి సోమవారం విడుదల చేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ గణంకాలు వెల్లడించింది. వీటి ప్రకారం వచ్చే ఏడాదికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను భారత్ వెనక్కి నెట్టనుంది.
ఎంతంటే?
2023 నాటికి చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని ఐరాస నివేదిక వెల్లడించింది. ఐరాస గణాంకాల ప్రకారం ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు. భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.
ఆ 2 ప్రాంతాల్లో
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు ప్రాంతాలుగా తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాలు నిలిచాయని ఐరాస నివేదిక వెల్లడించింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 230 కోట్ల జనాభా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 29 శాతం ఇక్కడే నివసిస్తున్నారు.
210 కోట్ల జనాభాతో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది.
800 కోట్లు
2022 నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని ఐరాస అంచనా వేసింది. 2030 నాటికి ఈ సంఖ్య 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరే అవకాశముందని తెలిపింది.
Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం
Also Read: Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్!