టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు ఇండిగో ఫ్లైట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ముంబై నుంచి IndiGo6E అనే ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణమైంది పూజాహెగ్డే. అయితే ఫ్లైట్ లో పని చేసే విపుల్ అనే స్టాఫ్ మెంబర్ తమతో చాలా పొగరుగా ప్రవర్తించాడని.. తమను పట్టించుకోకపోగా.. బెదిరిస్తున్నట్లు మాట్లాడాడని చెప్పుకొచ్చింది పూజా. 


నిజానికి ఇలాంటి ఇష్యూస్ ను సోషల్ మీడియా వరకు తీసుకురానని.. కానీ ఇదొక భయానకమైన అనుభవమని చెప్పుకొచ్చింది. పూజా ట్వీట్ చేసిన కాసేపటికే ఇండిగో అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి రిప్లై వచ్చింది. ముందుగా పూజాని క్షమాపణలు కోరుతూ.. దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్, పీఎన్ఆర్ డీటైల్స్ ను షేర్ చేయమని కోరింది. 


ఈ మధ్యకాలంలో చాలా మంది తారలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్నామధ్య ఎయిర్ పోర్ట్ లో అధికారులు తనతో తప్పుగా ప్రవర్తించారని నటి అయిషా టాకియా తెలిపింది. అలానే చాలా మంది హీరోయిన్లు ఫ్లైట్ లో తము ఫేస్ చేసిన ఇష్యూస్ ను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు పూజాహెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. 


Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ


Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?