Virata Parvam Movie Review: 'విరాట పర్వం' సినిమా ఎలా ఉంది? జూన్ 17న ప్రేక్షకులకు తెలుస్తుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విడుదల అయ్యేది ఆ రోజే. అయితే, కొందరు ప్రముఖులకు మాత్రం సినిమా ఎలా ఉందో తెలుసు. ఎందుకంటే... ప్రివ్యూ షో చూశారు. నిర్మాత స్వప్నా దత్, దర్శకురాలు నందినీ రెడ్డి, యువ హీరో నిఖిల్ తదితరులు సినిమా చూశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు తెలిపారు. వాళ్ళు ఇచ్చిన రివ్యూలు ఎలా ఉన్నాయంటే...
''ఆణిముత్యం లాంటి సినిమా 'విరాట పర్వం' చూసే అవకాశం లభించింది. ఇది మీతో ఉంటుంది. మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సినిమాతో రానా దగ్గుబాటి మరింత ఉన్నత స్థాయికి వెళతాడు. సాయి పల్లవి... ఏంటమ్మా నువ్వు? అద్భుతంగా నటించావ్. దర్శకుడు వేణు ఊడుగుల క్లాసిక్ తీశాడు. థియేటర్లలో సినిమా చూడండి'' అని నిర్మాత స్వప్నా దత్ చెప్పారు.
''వేణు ఊడుగుల చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా సినిమా తీశారు. సాయి పల్లవి మేజిక్ చేసింది. ఆమె నటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. రానా దగ్గుబాటి రాక్ స్టార్. విజువల్స్, నేపథ్య సంగీతం బావున్నాయి. చాలా రోజుల పాటు ఈ సినిమా మీ హృదయంలో ఉంటుంది'' అని దర్శకురాలు నందినీ రెడ్డి పేర్కొన్నారు.
''జస్ట్... ఇప్పుడే 'విరాట పర్వం' చూశా. ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ. సినిమా చూశాక... షాక్‌లో, ఆశ్చర్యంలో ఉన్నాను. సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది. రానా దగ్గుబాటి నటన సినిమాను అద్భుతంగా మార్చింది. ఇటువంటి సినిమా తీసిన దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ రెడ్డికి హ్యాట్సాఫ్'' అని యువ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.
Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?
''వెండితెరపై చెప్పిన ఓ అందమైన కవిత 'విరాట పర్వం'. చాలా అందంగా, శక్తివంతంగా, ప్రభావం చూపేలా ఉంది. కళకు, కళాకారిణికి మధ్య గీతను సాయి పల్లవి చెరిపేశారు. నిశ్శబ్ద తుఫానులా రానా అద్భుతంగా నటించారు. 'విరాట పర్వం' ఒక క్లాసిక్. చాలా రోజుల పాటు మీ హృదయాల్లో ఉంటుంది'' అని 'మేజర్' నిర్మాతలలో ఒకరైన శరత్ చంద్ర ట్వీట్ చేశారు.
Also Read: నా జీవితం నయనతారకు అంకితం, మీ అందరికీ రుణపడి ఉంటా - పెళ్లికి ముందు విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్