రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన సినిమా '777 చార్లీ'. కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల జూన్ 10న విడుదల అవుతోంది. అయితే, విడుదలకు ముందే దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ప్రీమియర్ షోలు వేశారు. కొంత మంది ప్రముఖులు సినిమా చూశారు. వాళ్ళు ఏమన్నారంటే...


777 Charlie Review By KGF 2 Heroine Srinidhi Shetty: ''బ్యూటిఫుల్ ఫిల్మ్ '777 చార్లీ' చూశా. ధర్మ (సినిమాలో రక్షిత్ శెట్టి పేరు), చార్లీ కథ హృదయానికి హత్తుకుంటుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. మీరంతా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను'' అని 'కెజియఫ్ 2' హీరోయిన్ శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు.


Niharika Konidela reviews 777 Charlie Movie: ''777 చార్లీ' అరుదైన సినిమా.  ఎంతో ప్రేమతో, నిజాయతీగా తీశారు. బావుంది. ఈ సినిమా నచ్చడానికి మీరు యానిమల్ లవర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనిషి అయితే చాలు. రక్షిత్ శెట్టి ఎక్సట్రాడినరీగా నటించారు. చార్లీ (సినిమాలో నటించిన శునకం పేరు) కళ్ళు మీ మనసు దోచుకుంటుంది. చార్లీ లాంటి సినిమా తీయడం సామాన్యమైన విషయం కాదు. దర్శకుడు కిరణ్ రాజ్ బాగా తీశారు. ఈ సినిమాను తెలుగుకు తీసుకొచ్చిన రానా దగ్గుబాటికి థాంక్స్'' అని నిహారికా కొణిదెల పేర్కొన్నారు.

 


'క్షణం' దర్శకుడు రవికాంత్ సహా నాగశౌర్య 'అశ్వథ్థామ‌', కళ్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' దర్శకుడు రమణ తేజ, కథానాయిక సిమ్రాన్ చౌదరి, మరికొంత మంది ప్రముఖులు మంగళవారం రాత్రి '777 చార్లీ' సినిమా చూశారు.


Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయనతార - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులు ఏవి?


''సినిమాకు వెళ్ళేటప్పుడు బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్లడం మరువకండి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆర్టిస్టుల నటన అయితే టెర్రిఫిక్'' అని రవికాంత్ పేర్కొన్నారు. హార్ట్ టచింగ్ సినిమా అని రమణ తేజ తెలిపారు. 


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ