నయనతార పెళ్లి (Nayanthara Marriage) హడావిడి మొదలైంది. తమిళ దర్శకుడు, నయన్‌కు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ పెళ్లి వేదికను తిరుపతి నుంచి ఎందుకు మహాబలిపురానికి మార్చాల్సి వచ్చిందో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ వివాహానికి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామని తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను స్వయంగా కలిసిన విఘ్నేష్ శివన్, నయనతార... పెళ్లికి వచ్చి తమను ఆశీర్వదించ వలసిందిగా కోరారు. తమిళ సినీ ప్రముఖులు కొంత మందికి శుభలేఖలు అందజేశారు. మరి, తెలుగు సినిమా ప్రముఖుల సంగతి ఏంటి?
నయనతార పెళ్లికి లేదా రిసెప్షన్‌కు హాజరు కానున్న సినీ ప్రముఖుల జాబితాలో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి వంటి తమిళ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు నుంచి చిరంజీవి పేరు తప్ప మరొకరి పేరు వినిపించడం లేదు. చిరంజీవికి సైతం డిజిటల్ ఇన్విటేషన్ పంపించి... ఫోనులో ఆహ్వానించారని టాక్.
నయనతారకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోల పక్కన అవకాశాలు ఇచ్చింది. నటిగా నయనతారకు పేరు రావడానికి సీత పాత్ర రావడం ఒక కారణం. బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' ఆమెకు గౌరవం తెచ్చింది. తమిళంతో పోలిస్తే... తెలుగులో ఆమె అత్యధిక పారితోషికం అందుకుంది. అటువంటి ఇండస్ట్రీని, ప్రముఖులను ఆమె విస్మరించడం బాలేదని టాలీవుడ్ టాక్.
Also Read: Vignesh Shivan Nayanthara Wedding Card: నయనతార పెళ్లి శుభలేఖ చూశారా? వైరల్ వెడ్డింగ్ కార్డ్
ప్రస్తుతానికి అయితే నయనతార పెళ్లికి ఆహ్వానం అందిన తెలుగు ప్రముఖులను వేళ్ళ మీద లెక్క పెట్టడం కష్టం అని ఇండస్ట్రీ గుసగుస. పెళ్లి తర్వాత ఫొటోలు బయటకు వస్తే తప్ప... టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్లారనే విషయంలో స్పష్టత రాదు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కూడా తెలుగు సినిమా ప్రముఖులు ఎవరినీ ఆహ్వానించలేదు.
Also Read: నయనతారను తిరుపతిలో ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పిన విఘ్నేష్ శివన్