హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) గుర్తు ఉన్నారా? నట సింహం నందమూరి బాలకృష్ణ 'మహారథి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గుడుంబా శంకర్' సినిమాల్లో నటించిన మలయాళ ముద్దుగుమ్మ! ఇప్పుడు తెలుగు సినిమాకు సంతకం చేశారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్ చేశారు. విశేషం ఏమిటంటే... పదేళ్ళ విరామం తర్వాత తెలుగులో మీరా జాస్మిన్ చేస్తున్న చిత్రమిది.


'విమానం'లో మీరా జాస్మిన్!
మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు, తమిళ సినిమా 'విమానం' (Vimanam Movie). జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఈ రోజు మీరా జాస్మిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ తెలుగు, తమిళ ద్విభాషా సినిమాను ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


'విమానం'లో మీరా పాత్ర ఏమిటి?
ఇప్పుడు 'విమానం' సినిమా అనౌన్స్ చేయడంతో... అందులో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనే డిస్కషన్ మొదలైంది. మీరా జాస్మిన్ గ్లామర్ రోల్ చేస్తున్నారా? లేదంటే పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ''ఎదురు చూపులకు తెర పడింది. వెల్కమ్ బ్యాక్ మీరా జాస్మిన్'' అంటూ నిర్మాణ సంస్థలు సినిమా విషయాన్ని వెల్లడించాయి గానీ దర్శకుడు ఎవరు? ఇతర వివరాలు ఏమిటి? అనేది చెప్పలేదు. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు సముద్రఖని ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన షూటింగులో జాయిన్ కానున్నారు.


Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే? 






మీరా జాస్మిన్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆమె ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరంగా లేరు. నటనకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. అయితే, 2014 తర్వాత మీరా జాస్మిన్ చేసిన సినిమాల సంఖ్య చూస్తే... నాలుగు అంటే నాలుగే. అవి కూడా మలయాళ సినిమాలు. తెలుగులో సినిమా చేసి అయితే పదేళ్ళు అవుతోంది.


Also Read : జీవితంలో పెళ్లి, రిలేషన్షిప్ వద్దంటున్న శ్రీ సత్య - ఓసారి సూసైడ్ కూడా!
 
Meera Jasmine Hit Movies : 'మోక్ష' (2013) తర్వాత మీరా జాస్మిన్ తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే, అంతకు ముందు స్టార్స్ సరసన నటించారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు... రవితేజ, గోపీచంద్, రాజశేఖర్, శ్రీకాంత్, శివాజీ వంటి హీరోలతో మీరా జాస్మిన్ నటించారు. శివాజీతో చేసిన 'అమ్మాయి బాగుంది'లో ఆమెది డ్యూయల్ రోల్. ఆ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది. రవితేజ 'భద్ర' కూడా తెలుగులో పెద్ద హిట్. 'గోరింటాకు'లో రాజశేఖర్ చెల్లెలి పాత్రలో మీరా జాస్మిన్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బింగ్ సినిమా 'పందెం కోడి' కూడా మీరాకు మంచి హిట్ ఇచ్చింది. 


ఇన్‌స్టాలో గ్లామరస్ ఎంట్రీ
తెలుగు ప్రేక్షకులు ఆల్మోస్ట్ మీరా జాస్మిన్ (Meera Jasmine)ను మర్చిపోయిన సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు సినిమాల్లో గానీ, ఆ సమయంలో ఇతర భాషల్లో చేసిన సినిమాల్లో గానీ మీరా జాస్మిన్ పద్ధతిగా కనిపించారు. డ్రస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండేది. ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసింది లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకున్నారు.