ప్రేమికుల రోజు ముగిసింది. మరి, తారలు ఎక్కడ ఉన్నారు? స్టార్ హీరోయిన్లు ఈ ఏడాది వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రకుల్ ప్రీత్ సింగ్, శృతి హాసన్ వంటి హీరోయిన్లు తమ తమ ప్రేమికుల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ప్రేమలో లేని వాళ్ళ సంగతి ఏంటి? ప్రేమను దాచి పెడుతున్న వాళ్ళ సంగతి ఏంటి? ఎవరు ఎలా ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకున్నారు? ఓ లుక్ వేయండి!


హైదరాబాదులో...
షూటింగులో తమన్నా!
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ టౌన్స్‌లో లేటెస్ట్ లవ్ బర్డ్ అంటే మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెప్పాలి. విజయ్ వర్మతో లిప్ లాక్ చేస్తూ... ఈ ఏడాది, 2023కి వెల్కమ్ చెప్పినప్పటి నుంచి ప్రేమికుల జాబితాలో ఆమె పేరు తప్పకుండా ఉంటోంది. ప్రేమలో ఉన్నట్టు పబ్లిగ్గా తమన్నా ఎప్పుడూ చెప్పలేదు. అయితే, ఈ వాలెంటైన్స్ డేకి ఆమె విజయ్ వర్మతో లేరు. హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న 'భోళా శంకర్' షూటింగులో ఉన్నారు. అదీ సంగతి!


ప్రేమికుడితో కాదు...
ప్రగ్యాతో రకుల్ ప్రీత్ పార్టీ!
హిందీ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడో చెప్పారు. అయితే, ఈ ప్రేమికుల రోజున వాళ్ళిద్దరూ కనపడలేదు. ప్రగ్యా జైస్వాల్, రకుల్ కలిసి ముంబైలో ఓ రెస్టారెంటుకు లంచ్ చేయడానికి వెళ్ళారు. బహుశా... రకుల్ ప్రేమికుడు ముంబైలో లేరేమో!? అఫ్ కోర్స్... అంతకు ముందు సోషల్ మీడియాలో అతడితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పారనుకోండి!


శ్రుతి కూడా అంతే...
స్నేహితులతో కలిసి!
ప్రేమలో ఉన్న మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్! ఆమె కూడా ప్రేమికుడితో కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. తన లవర్ శాంతను హజారికా సిటీలో లేరని పేర్కొన్నారు. తనకు ఇష్టమైన మ్యూజిక్ సెషన్స్, కంపోజింగ్స్, ఆ తర్వాత డిన్నర్ పార్టీతో ప్రేమికుల రోజుకు వీడ్కోలు చెప్పారు. 


కశ్మీర్ లోయలో... 
మంచు కొండల్లో త్రిష!
కొన్నేళ్ళుగా సింగిల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష. ఈ ప్రేమికుల రోజున ఆమె కశ్మీర్ లోయలో, మంచు కొండల్లో ఉన్నారు. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'లియో' చిత్ర బృందంతో! ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అదీ సంగతి!


రిమ్ జిమ్...
సామ్ టెంపుల్ టైమ్!
ఇప్పుడు సమంత సింగిల్! ఈ ప్రేమికుల రోజున ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసా? జిమ్ లో! అవును... ట్రైనింగ్ సెషన్‌లో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ఫాలోయర్లకు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పారు. అంతుకు ముందు తమిళనాడులో పళని స్వామి ఆలయానికి వెళ్ళారు. శర్మ సిస్టర్స్ నేహా, అయేషా ముంబైలో జిమ్ ముందు కనిపించారు.  


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?


సిద్ధార్థ్, అదితీ రావు హైదరి ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. అయితే, ఆమె సిద్ధూతో ఫోటో కాదు... ధర్మేంద్రతో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి వాలెంటైన్స్ డే విషెష్ చెప్పారు. ఆ ఫోటో కింద రెండు లవ్ ఎమోజీలు సిద్ధార్థ్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమికుల రోజున భార్య స్నేహా రెడ్డితో కలిసి టైమ్ స్పెండ్ చేశారు. ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారని ఈ మధ్య విపరీతంగా వార్తలు వచ్చాయి. ఈ ప్రేమికుల రోజున ఆగ్రాలో కొత్త సినిమా 'షెహజాదా' ప్రచార కార్యక్రమాల్లో కృతి పాల్గొన్నారు. తాజ్ మహల్ ముందు ఆమె ఫోజులు ఇచ్చారు. 'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం పుణె వెళ్లారు. 


Also Read : హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం! ఆయన్ను ఎందుకు 'గురూజీ' అంటున్నారు?