కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందింది. 'బన్నీ' వాస్ నిర్మించారు. ఈ శనివారం (ఫిబ్రవరి 18న) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మీరు లిక్కర్ (మద్యపానం), సిగరెట్ (ధూమపానం) కు సంబంధించిన యాడ్ చూడలేరు! ఎందుకంటే...
 
సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు నిర్మాత 'బన్నీ' వాస్ వెల్లడించారు. అంతే కాదు... ఇందులో నటీనటులు ఎవరూ మద్యం సేవించే సన్నివేశాలు గానీ, సిగరెట్ తాగే సీన్లు గానీ లేవని ఆయన చెప్పారు. అందువల్ల,లిక్కర్ & సిగరెట్ యాడ్ ఉండదన్నమాట. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి నేపథ్యంలో ఆ సీన్లు ఉండటం సబబు కాదని చిత్ర బృందం భావించి ఉండొచ్చు. ఏది ఏమైనా వాళ్ళు తీసుకున్నది మంచి నిర్ణయం అని చెప్పాలి. 


థ్రిల్లింగ్ అంశాలు కూడా!
'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రచార చిత్రాలు చూసినా... పాటలు విన్నా సరే... ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతూ ఉంటుంది. అయితే, ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయని 'బన్నీ' వాస్ తెలిపారు. దైవత్వం, హాస్యం, కుటుంబ అంశాలు మేళవించి రూపొందించిన చిత్రమని ఆయన చెప్పారు. ఇందులో అమ్మాయిలకు సంబంధించి మంచి సందేశం ఇచ్చారని సమాచారం.,


Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే? 
 
అఖిల్ అతిథిగా...రేపే ప్రీ రిలీజ్!
Akhil For VBVK  : 'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రీ రిలీజ్ వేడుకకు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ముఖ్య అతిథిగా రానున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 16 (రేపు, గురువారం) సాయంత్రం ఆ వేడుక జరగనుంది. ఆ విషయాన్నీ జీఏ2 పిక్చర్స్ అనౌన్స్ చేసింది. అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి విజయాన్ని ఆ సంస్థ అందించింది. అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకోసం వస్తున్నారు.


Also Read : 'యాంట్ మ్యాన్ 3'లో ఐరన్ మ్యాన్? - కొత్త ట్విస్ట్ ఏందయ్యా?






తిరుపతి నేపథ్యంలో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా కథ జరుగుతుంది. ఈ మధ్య 'సోల్ ఆఫ్ తిరుపతి' పేరుతో సినిమాలో నాలుగో పాట విడుదల చేశారు. ఏడు కొండల వేంకటేశ్వరునికి అపర భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం కుటుంబ సభ్యుల చేత ఆ పాటను ఆవిష్కరింపజేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.


'వాసవ సుహాస...'తో పాజిటివ్ వైబ్స్!
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమా టీజర్ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో విడుదలకు ముందు సినిమా లాభాల్లోకి వెళ్ళిందని సమాచారం.