Abhiram Telugu Movie Teaser Released: యష్ రాజ్, నవమి గాయక్ జంటగా నటించిన సినిమా 'అభిరామ్'. శివ బాలాజీ, 'కాలకేయ' ప్రభాకర్ ప్రధాన తారాగణం. లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాసులు నిర్మిస్తున్నారు. రామకృష్ణార్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ చేతుల మీదుగా ఇటీవల 'అభిరామ్' టీజర్ విడుదల చేశారు.
దండికోట అంటేపాపిరెడ్డి పద్మవ్యూహం...
అభి ప్రేమ కావాలంటోన్న ఆ అమ్మాయి!
'అభిరామ్' సినిమా టీజర్ విషయానికి వస్తే... శంఖం పూరిస్తున్న శివ భక్తులను తొలుత చూపించారు. ఆ తర్వాత 'కాలకేయ' ప్రభాకర్ పాత్రను పరిచయం చేశారు. 'గండి కోట అంటే ఈ పాపిరెడ్డి గీసిన పద్మవ్యూహం రా!' అని ఆయనతో ఓ డైలాగ్ చెప్పించారు. హీరో యష్ రాజ్, నటుడు శివ బాలాజీలను పవర్ ఫుల్ ఫైట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. 'వాళ్ళతో మాటలు ఏమిటిరా నరికేయక' అని మరో క్యారెక్టర్ చెప్పే డైలాగ్, 'నాకు నువ్వు కావాలి అభి! నీ ప్రేమ కావాలి' అని హీరోయిన్ చెప్పే మాటలు వింటుంటే... యాక్షన్ నేపథ్యంలో ప్రేమకథగా సినిమా తీసినట్టు అర్థం అవుతోంది.
Also Read: కొణిదెల వారి కొత్త కోడలు ఇంటి పేరు మార్చిందండోయ్ - ఉపాసన రూటులో లావణ్య
ఆడియో సక్సెస్... సినిమా కూడా సక్సెస్ కావాలి!
Abhiram Teaser Launch by Producer Prasanna Kumar: టీజర్ చూసిన తర్వాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... ''ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ ఛానల్‌లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ పాటలకు వస్తున్న స్పందన చాలా బావుంది. టీజర్ చూస్తుంటే... మంచి ప్రేమ కథ, వాణిజ్య హంగులు వంటివి మేళవించి తీసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో శివ బాలాజీ, యష్ రాజ్ నవమితో పాటు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, వై విజయ, రఘు బాబు, 'బాహుబలి' ప్రభాకర్ నటించారు. గండికోట సంస్థానం తరహాలో ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున సినిమా నిర్మించారు. ఆడియో సక్సెస్ అయినట్లు సినిమా కూడా సక్సెస్ కావాలి. నిర్మాత శ్రీనివాసులు, దర్శకుడు రామ కృష్ణార్జున్, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలి'' అని అన్నారు. ఆయనకు నిర్మాత శ్రీనివాసులు థాంక్స్ చెప్పారు.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
యష్ రాజ్, శివ బాలాజీ, నవమి గాయక్ (Navami Gayak) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకత్వం: చంటి, కో డైరెక్టర్: మడత శివ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఉల్లగంటి ప్రసాద్, నృత్య దర్శకత్వం: చంద్ర కిరణ్, స్టంట్స్: విన్చెన్ అంజి, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ఛాయాగ్రహణం: జగదీష్ కొమారి, సాహిత్యం: సాగర్ నారాయణ ఎం, సంగీతం: మీనాక్షి భుజంగ్, నిర్మాత: జింకా శ్రీనివాసులు, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రామ కృష్ణార్జున్.