'అందాల రాక్షసి'గా తెలుగు ప్రేక్షకులకు, తెలుగు చిత్రసీమకు పరిచయమైన త్రిపాఠి వారి ఇంటి అమ్మాయి లావణ్య. ఇప్పుడు ఆమె కొణిదెల వారి ఇంటి కోడలు. ఆ న్యూస్ తెలుగు ప్రజలకు తెలుసు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఇటలీలో ఈ ఏడాది నవంబర్ 1న ఏడు అడుగులు వేశారు. పెళ్లి తర్వాత తోడి కోడలు ఉపాసన రూటులో లావణ్యా త్రిపాఠి వెళుతున్నారు. అక్కను ఫాలో అవుతూ ఇంటి పేరు మార్చారు. 


ఇక నుంచి లావణ్యా త్రిపాఠి కొణిదెల
ఇప్పుడు లావణ్య త్రిపాఠీ సోషల్ మీడియా అకౌంట్స్ చూశారా? మొన్నటి వరకు 'లావణ్య త్రిపాఠి' అని ఉండేది. ఇప్పుడు ఆ పేరు చివర 'కొణిదెల' కూడా యాడ్ అయ్యింది. అవును... ఇప్పుడు ఆమె పేరు 'లావణ్య త్రిపాఠి కొణిదెల'. ఇక నుంచి ఆమెను అలాగే పిలవాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో పెద్ద కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం పెళ్లి తర్వాత తన పేరు చివర కొణిదెల ఇంటి పేరును యాడ్ చేశారు. సోషల్ మీడియాలో 'ఉపాసన కామినేని కొణిదెల' అని ఉంటుంది. అదీ సంగతి!


Also Read'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...




వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వాళ్ళ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. వచ్చే ఏడాది ఇద్దరూ తెరపై సందడి చేయనున్నారు. వరుణ్ తేజ్ కొత్త సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' టీజర్ సోమవారం విడుదలైంది. దానిపై లావణ్యా త్రిపాఠి ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి సినిమాలు తీయడానికి గట్స్ ఉండాలని చెప్పుకొచ్చారు.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!  



ప్రస్తుతం 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. దానికి ముందు కొత్త జంట హనీమూన్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చింది. ఆ టూర్ వెనుక 'ఆపరేషన్ వేలంటైన్' వాయిదా కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాను తొలుత డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... వచ్చే ఏడాదికి ఆ సినిమా వాయిదా పడటంతో వరుణ్ తేజ్ (Varun Tej)కు కొంత ఫ్రీ టైమ్ దొరికింది.


Also Read: ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లో అది కామన్, హీరోను ఇరిటేట్ చేశా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శృతి హాసన్


హనీమూన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న 'మట్కా' చిత్రీకరణలో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యారు. లావణ్యా త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ అభిజీత్ నటిస్తున్నారు. అది కాకుండా మరో సినిమాకు ఆమె సంతకం చేసినట్లు తెలిసింది.