'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. అలానే ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇవ్వన్నీ కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.
డిసెంబర్ 3న సినిమా ట్రైలర్ ను అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీనికోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తికావొస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజమౌళి సాంగ్ షూటింగ్ కోసం మళ్లీ సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు.
సినిమాలో రామ్ చరణ్, అలియా భట్ ల మధ్య లవ్ ట్రాక్ పెద్దగా ఉండదట. దీంతో వీరిద్దరిపై ఓ పాటను చిత్రీకరిస్తే.. బాలీవుడ్ ప్రమోషన్స్ లో ఆ పాటను బాగా వాడుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో డౌటే. ఒకవేళ ట్రైలర్ గనుక ప్రభంజనం సృష్టిస్తే.. ఈ ప్రమోషనల్ సాంగ్ ఐడియాను విరమించుకునే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ కనిపించనుంది. ఇక అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్, డిజిటల్ మొత్తం కలిపి రూ.650 నుంచి రూ.700 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు.
Also Read: 'మాట్లాడుకోవడాల్లేవ్'.. బోయపాటి నిర్ణయం అందుకేనా..?
Also Read: బిగ్ బాస్.. ‘టికెట్ టు ఫినాలే’.. కింద మంచు పెట్టి మరీ టార్చర్.. ‘నాకు ఒళ్లు కొవ్వు’ అంటున్న ప్రియాంక!