1983లో ఇండియా ప్రపంచ కప్ గెలిచిన ఉద్వేగ క్షణాలను వెండితెరపై చూసే రోజు వచ్చేసింది. శుక్రవారం (డిసెంబరు 24న) ‘83’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, రణ్‌వీర్ సింగ్, కబీర్ ఖాన్, కపిల్ దేవ్, శ్రీకాంత్ కృష్ణమాచారి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘83’ చిత్రం విశేషాల తెలిపారు. 


హీరో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త పాత్రలు చేయాలనే పిచ్చి.. కపిల్ దేవ్ పాత్రను పోషించేలా చేసింది. 1983లో ప్రపంచకప్ గెలిచిన టీమ్‌ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం కపిల్‌ దేవ్‌తో కొన్నాళ్లు ప్రయాణం చేశాను. ఆ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివి’’ అని తెలిపాడు. దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం.. ఎంతో రీసెర్చ్ చేశాం. ఆ మ్యాచ్ ఆడిన క్రీడాకారులను కలిశాం. కపిల్ దేవ్‌తో కలిసి ప్రయాణించడం ఓ చక్కని అనుభూతి’’ అని తెలిపారు. 


శ్రీకాంత్ కృష్ణమాచారి మాట్లాడుతూ.. ‘‘నేను, నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్. ఆ తర్వాత కొన్ని రోజులకు చైన్ పట్టుకుని ‘శివ’ అవతారంలో కనిపించారు’’ అని శ్రీకాంత్ నవ్వులు పూయించారు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ రెండు భాగాలుగా చూపించారు. ఒకటి క్రికెట్. మరొకటి ఫ్యామిలీ. ఆ రెండు కలిపి చూపించడం చాలా బాగుంది. వెండితెరపై క్రికెట్‌ను చూపించడం సులభమే. కానీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ చూపించడమే కష్టం. ఈ చిత్రంలో నాకు రణ్‌వీర్ సింగ్ కనిపించలేదు. కేవలం కపిల్‌దేవ్ మాత్రమే కనిపించాడు’’ అని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే బాధ్యతలను నాగార్జున తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచినప్పుడు ప్రతి భారతీయుడు కాలరెగరేసుకుని తిరిగారు. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాటి చారిత్రక ఘటనతో రూపొందించిన ‘83’ చిత్రాన్ని యువత తప్పకుండా చూడాలి’’ అని అన్నారు. 


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి