పరీక్షలో పాస్ కావాలని నకలు కొట్టేందుకు.. చిట్టీలు ఎక్కడెక్కడో పెట్టి తీసుకొస్తాం. ఇక చిట్టీలు కొట్టేందుకు భయపడే వాళ్లు.. పక్కన ఉండే.. స్నేహితుడిపై ఆధారపడతారు. ప్లీజ్.. ప్లీజ్... చూపించు అంటూ వేడుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చిట్టీలు కొట్టడంలో హైటెక్ బ్రేయిన్ ఉపయోగించాడు. తప్పు చేస్తే.. అందులోనూ పోలీస్ పరీక్షలోనే నకలు కొట్టే ప్రయత్నం చేస్తే.. దొరకకుండా ఉంటాడా? గురుడు దొరికేశాడు... పరువు పోయింది.
ఉత్తరప్రదేశ్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్షలకు ఓ వ్యక్తి హాజరయ్యాడు. అందరిలానే మమూలుగా వచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లి.. తన.. సిట్టింగ్ ప్లేస్ లో కూర్చొన్నాడు. అయితే అతడు తన హెయిర్స్ పై నుంచి మరో విగ్ పెట్టుకున్నాడు. అందులో హైటెక్ బ్లూటూత్ దాచాడు. అంతేకాదు.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల సహాయంతో కాపీ చేయడం మెుదలపెట్టాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తప్పు చేస్తే.. ఏదో ఒకలా దొరుకుతారనేది ఇక్కడ జరిగిన ఘటనతో నిజమైపోయింది. అతని తల దగ్గర మెటల్ డిటెక్టర్ మోగడం ప్రారంభించింది. ఈ సౌండ్ ఎక్కడ వస్తుందబ్బా.. అనుకుంటూ.. అధికారులు వెతకడం ప్రారంభించారు. ఇక చివరకు హైటెక్ కాపీ రాజా దొరికాడు.
అతడు విగ్ తీస్తుంటే.. అధికారులే ఆశ్చర్యపోయారు. అతడికి ఉన్న హెయిర్స్ కి విగ్ ను పెట్టుకున్నాడు. అందులో.. బ్లూ టూత్.. వైరలెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇక కాపీ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఉపయోగించిన ఇయర్‌ఫోన్‌లు ఎంత చిన్నవిగా ఉన్నాయో వీడియోలో చూడవచ్చు.