Telangana Elections 2023 Live News Updates: రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వండి- ఈసీని కోరిన బీఆర్‌ఎస్ 

Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..

ABP Desam Last Updated: 27 Nov 2023 05:55 PM
PM Modi Roadshow In Hyderabad: కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న ప్రధాని రోడ్ షో

హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రయాణికులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. నేటి (సోమవారం) సాయంత్రం రెండు గంటలపాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో (PM Modi Road Show) కారణంగా సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు ఈ రెండు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు.



ప్రధాని రోడ్ షో కు భద్రతాపరమైన కారణాలతో అధికారులు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు. ప్రయాణికులు ఇది గమనించాలని ఓ ప్రకటనలో కోరారు. కాగా, సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమై.. అక్కడినుంచి నారాయణగూడ, వైఎంసీఏల మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు కొనసాగనున్న రోడ్ షోలో ప్రధాని ప్రసంగించనున్నారు.

PM Modi Roadshow: హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షో ప్రారంభం

Chikkadpally and Narayanaguda stations closed 2 hours: హైదరాబాద్: నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రధాని రోడ్ షో మొదలైంది. నగరానికి వచ్చిన ప్రధానిని చూసేందుకు బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో కొనసాగుతుంది. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగుతున్నారు.

రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వండి- ఈసీని కోరిన బీఆర్‌ఎస్ 

రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదని బీఆర్‌ఎస్ అంటోంది. ఈ మేరకు ఈసీకి ఓ రిక్వస్ట్ పెట్టింది. రైతు బంధు పథకం పాతదే అని.. దాన్ని ఎన్నికల నిబంధనల పేరుతో ఆపేయడం మంచిది కాదని సూచించింది. ఆపేయాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని రిక్వస్ట్ పెట్టింది. 

బీఆర్‌ఎస్ చేసిన అన్ని స్కామ్‌లపై దర్యాప్తు చేయిస్తాం: మోదీ 

తెలంగాణలో కచ్చితంగా ఈ సారి మార్పు ఉండబోతోందన్నారు ప్రధానమంత్రి మోదీ. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో తొలి బీజేపీ సీఎం బీసీ వ్యక్తే అవుతారన్నారు. ఎన్డీఏలోకి రావాలని కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారని అవి సఫలం కాలేదన్నారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీ వచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలచుకోలేనని అన్నారు. ఎన్డీఏలో చేర్చుకోలేదని బీఆర్‌ఎస్ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన స్కామ్‌లన్నింటిపై దర్యాప్తు చేయిస్తామని మాట ఇచ్చారు. స్కామ్ చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టబోమన్నారు. తెలంగాణకు ఫామ్‌హౌస్ సీఎం అవసరం లేదన్నారు మోదీ 

కాంగ్రెస్‌ గ్యారెంటీలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాండ్ పేపర్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు తెలియజేసేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని అందులో పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ వాళ్లే రైతు బంధును బంద్‌ చేయిస్తున్నారు - హరీష్‌రావు 

కాంగ్రెస్ వాళ్లే పని గొట్టుకొని ఫిర్యాదులు చేయించి రైతు బంధును బంద్ చేయిస్తున్నారని విమర్శించారు. రైతు బంధును బందు చేయించిన కాంగ్రెస్‌ వాళ్లను ఓటుతో పోటు పోడవాలన్నారు. 

మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంట్లో అధికారుల తనిఖీలు- స్పృహ తప్పిపోయిన భార్య

అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంటిపై ఐ.టి. పోలీసు అధికారులు దాడులు చేశారు. అలంపూర్‌లోని శాంతి నగర్‌లో ఆ తనిఖీలు చేపట్టారు. తాళాలు పగలకొట్టి మరీ ఇంటి లోపలికి వెళ్లి సోదాలు చేపట్టారు. తనిఖీ చేసిన పోలీసులకు ఎలాంటి డబ్బులు, వస్తువులు దొరకలేదని తెలుస్తోంది. ఈ దాడులతో భయభ్రాంతులకు గురైన సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. 

వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం: కవిత

తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేకపోగా మరింత నష్టాన్ని మాత్రం తెచ్చిపెట్టాయన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ హయాంలో బాగుపడింది పెద్ద పెద్ద కంపెనీలనీ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం అన్నారు కవిత 

తెలంగాణలో రైతు బంధుకు ఈసీ బ్రేక్‌- నిధుల పంపిణీ నిలిపివేత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు పథకం నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్ అభ్యర్థన మేరకు గత వారంలోనే  పంపిణీకి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

తెలంగాణలో రైతు బంధుకు ఈసీ బ్రేక్‌- నిధుల పంపిణీ నిలిపివేత

తెలంగాణలో రైతు బంధుకు ఈసీ బ్రేక్‌- నిధుల పంపిణీ నిలిపివేత 

Background

తెలంగాణలో ఎన్నికల ప్రచారం గడువు సమీపిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్‌, ప్రియాంకతో పాటు పలువురు కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రజల వద్దే ఉండే ఓటు అడిగి వెళ్లనున్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎపిసోడ్లో ఈ రోజు (నవంబర్ 2023) తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బడా నేతల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచే కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా బడా నేతలు తరలిరానున్నారు.


ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితరులు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.


నేడు ప్రధాని కార్యక్రమం ఇదే


ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 8 గంటలకు తిరుపతిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణలో ఎన్నికల పర్యటనకు రానున్నారు. తెలంగాణలో రెండు బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. మహబూబాబాద్ లో తొలి బహిరంగ సభ, కరీంనగర్ లో రెండో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం గంటలకు హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. 


జేపీ నడ్డా రోడ్ షో, 3 బహిరంగ సభలు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో మూడు బహిరంగ సభలు, రోడ్ షోలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.గంటల నుంచి జగిత్యాలలోని టౌన్ హాల్ రోడ్డు నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ బోధన్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 5 గంటలకు బాన్సువాడ కామారెడ్డిలో రెండో బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం మాధుర్ ప్రధాన కార్యాలయం జుక్కల్ (కామారెడ్డి)లో మూడో బహిరంగ సభ జరగనుంది.


అమిత్ షా ప్రచారం


కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేడు తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఒక బహిరంగ సభ, రెండు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పెద్దపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. మంచిర్యాలలో అమిత్ షా రెండో రోడ్ షో జరగనుంది.


కాంగ్రెస్ తరుపున ఖర్గే, ప్రియాంక


తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మూడు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటలకు భువనగిరిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గద్వాలలో రెండో బహిరంగ సభ, మధ్యాహ్నం నుంచి కొడంగల్ లో మూడో బహిరంగ సభ నిర్వహించనున్నారు.


సచిన్ పైలట్, జైరాం రమేష్ పీసీలు


ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయంలో సచిన్ పైలట్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.


అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ నెల 27న తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ నాలుగు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు దేవరకద్రలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు పరకాలలో రెండో బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 3.35 గంటలకు మెదక్ నియోజకవర్గంలో మూడో బహిరంగ సభ, సాయంత్రం 4.40 గంటలకు ఇబ్రహీంపట్నంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించనున్నారు 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.