BJP TDP Janasena Alliance In Andhra Pradesh Elections 2024 : ఏపీలో 2014 (2014 Political Combination)సీన్ రిపీట్ అవుబోతోంది. తెలుగుదేశం- జనసేనతో కలిసి నడిచేందుకు బీజేపీ(BJP) సిద్ధమైంది. జాతీయ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల లిస్టు కూడా ఖరారైంది. తెలుగుదేశం ఎన్డీఏలో చేరిందనే విషయాన్ని  రేపు శనివారం ప్రకటించనున్నారు. 


ఏపీలో పోటీ ఎలా అన్న విషయాన్ని బీజేపీ ఎట్టకేలకు తేల్చింది. చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా పాత ఎన్డీఏ(NDA) గ్రూపు మళ్లీ పోటీ చేయబోతోంది. తెలుగుదేశం-జనసేన(TDP Janasena) కలిసి నడవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి అభ్యర్థులను కూడా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ఏ విషయం తేల్చకుండా వస్తూ ఉన్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు ఓకే చెప్పింది. 
పొత్తులపై శనివారం ప్రకటన


2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విబేధించిన టీడీపీ(Telugug Desam) అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్‌తోనూ దూరం పెరగడంతో టీడీపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది. ఓట్ల చీలిక వల్ల నష్టపోయామని గుర్తించిన చంద్రబాబు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో కలిసిపోయారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో గొడవ మంచిది కాదని గుర్తించి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. గడచిన ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండు మూడుసార్లు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిశారు. కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం- జనసేన ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు పవన్ కల్యాణ్‌ కూడా తన వంతు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీఏలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ రేపు (శనివారం మార్చి 2)అధికారికంగా వెల్లడించనుంది. 


మార్చి 4న సీట్ల ప్రకటన: 
ఎన్డీలోకి తెలుగుదేశం చేరిన విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు(Chandra Babu), పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 4వతేదీన సీట్ల ప్రకటన కూడా చేయనున్నారు. ఇప్పటికే జనసేన-టీడీపీ కూటమి 99 సీట్లను అనౌన్స్ చేసేశాయి కూడా. బీజేపీ వైపు నుంచి చాలా రోజులు కదలిక లేకపోవడంతో టీడీపీ-జనసేన దూకుడుగా వ్యవహరించాయి. ఒకేసారి టీడీపీ 94, జనసేన 5 సీట్లను ప్రకటించేశాయి. జనసేనకు మొత్తం 24 సీట్లను కేటాయించగా.. ఐదు పేర్లను ప్రకటించారు. అంటే మిగిలిన స్థానాల్లో 19చోట్ల జనసేన పోటీ చేయనుంది. ఆ పైన మిగిలన వాటిని టీడీపీ- బీజేపే పంచుకోవాలి. 


బీజేపీ పోటీ చేయబోయే సీట్లు ఇవే…
బీజేపీ ప్రధాన లక్ష్యం లోక్‌సభ ఎన్నికలు కాబట్టి వారి ఫోకస్ వాటి పైనే ఉంది. పొత్తులపై ప్రకటన ఇంకా రానప్పటికీ సీట్ల సంఖ్య, కేటాయింపు విషయంలో బీజేపీ -టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 5 లోక్‌సభ, 9 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం
అరకు(Araku) 
తిరుపతి(Triupati) 
హిందూపురం(Hindupuram) 
కర్నూలు(Kurnool)
రాజమండ్రి(Rajahmundry) లేదా ఏలూరు (Eluru) స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 
అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం(Srikakulam), విశాఖ ఉత్తరం(Visakha South).. మాడుగుల(Madugula), నర్సాపురం(Narsapuram), ధర్మవరం(Dharmavaram), జమ్మలమడుగు(Jammalamadugu), మదనపల్లి(Madanapalli), తిరుపతి(Tirupati), పాడేరు(Paderu), కైకలూరు(Kaikaluru), నర్సరావుపేటల(Narsaraopeta)లో 9 స్థానాలను కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికల పోరాటంలోకి దూకేయాలని మూడు పార్టీలు అనుకుంటున్నాయి.


Also Read: ముగిసిన అనకాపల్లి పంచాయితీ - మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కీలక వ్యాఖ్యలు


Also Read: జెండా సభలో కనిపించని లోకేష్ - అందుకే దూరంగా ఉన్నారా ?