ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులు ఉందనగా సమాజ్‌వాదీ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. ఫిబ్రవరి 10న యూపీ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
ఇవే హామీలు..
- సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే చెరుకు రైతులకు పరిహారం అందిస్తామని అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. దీని కోసం ఓ కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.
- సాగు చట్టాలపై చేసిన పోరాటంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇస్తామని వాగ్దానం చేసింది. అలానే రాష్ట్రంలో వారికి గుర్తుగా స్మారకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
- రాష్ట్రంలో ద్విచక్ర వాహనం ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
భాజపా..
యూపీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. భాజపా తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో వివరించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం లభించేలా చూస్తామని మేనిఫెస్టోలో భాజపా తెలిపింది.
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు
Also Read: PM Modi Speech Highlights: కరోనా వంటి సంక్షోభాన్ని గత 100 ఏళ్లలో చూడలేదు: ప్రధాని మోదీ