రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వల్ల దేశం ఎదుర్కొన్న సంక్షోభంపై ప్రధాని మోదీ మాట్లాడారు. 100 ఏళ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదన్నారు.
కరోనా మహమ్మారి వంటి సమస్యను గత 100 ఏళ్లలో ప్రపంచం చూడలేదు. వివిధ రూపాల్లోకి మారి ఇది ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. యావత్ దేశం, ప్రపంచం మొత్తం దీనిపై పోరాటం చేస్తోంది. భారత్ సంకల్పం, నిబద్ధత కారణంగా కరోనాపై మనం చేసిన పోరాటాన్ని ప్రపంచమే కీర్తించింది. ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారి ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేశారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లో ఎన్నో చర్చల తర్వాత రైతులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చాం. ఈ కారణంగానే మన రైతులు వ్యవసాయంలో రెట్టింపు ఉత్పత్తిని సృష్టించారు. - ప్రధాని నరేంద్ర మోదీ
కాంగ్రెస్‌పై విమర్శలు..
ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి భాజపా సర్కార్ నిజాయితీగా చర్యలు చేపడుతోందని మోదీ అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం రెండకెల్లో ఉండేదన్నారు.
ద్రవ్యోల్బణం ప్రభావం యావత్ ప్రపంచంపై ఉంది. అమెరికా 40 ఏళ్లలో గరిష్ఠమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. బ్రిటన్ 30 ఏళ్లలో గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. భారత్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అతిపెద్ద ఆర్థికం కలిగి సగటు ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశం మనదే. వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరం. కాంగ్రెస్.. 'నేషనల్ కాంగ్రెస్' అని పేరు ఎందుకు పెట్టుకుంది? - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ X కాషాయ కండువా.. వ్యవహారంపై హైకోర్టు ఏమందంటే?
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు