Cheepurupalli assembly Constituency : విజయనగరం జిల్లా రాజకీయాలను గడిచిన రెండు దశాబ్ధాల నుంచి శాసిస్తున్న బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోన అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. గడిచిన నాలుగు ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. విజయం సాధించిన మూడుసార్లు మంత్రిగా కొనసాగారు. అటువంటి నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది. 


ఆరుసార్లు టీడీపీ.. నాలుగుసార్లు కాంగ్రెస్‌ విజయం


చీపురుపల్లి నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 1952లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నిక జరిగిన 1952లో ఇక్కడి నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పి గన్నయ్య తన సమీప ప్రత్యర్థి కేఎల్పీ నుంచి పోటీ చేసిన కె పున్నయ్యపై 6093 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే ఏడాది ద్విసభకు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన టీసీఏ నాయుడు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎంఎస్‌రాజుపై 143 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కె పున్నయ్య కేఎల్పీ నుంచి ఇక్కడ ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎం కూర్మయ్యపై 4841 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దిస్వసభకు జరిగిన ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన ఎంఎస్‌ రాజు తన సమీప ప్రత్యర్థి కేఎల్పీ నుంచి పోటీ చేసిన టీసీఏ నాయుడిపై 12,666 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు.


1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్‌ నాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎంఎస్‌ రాజుపై 4328 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తాడి రామారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కేఎస్‌ఏ నాయుడిపై 16,556 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి పైడపు నాయుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఎంఎస్‌ రాజుపై 2965 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


Also Read: నెల్లిమర్లలో రెపరెపలాడే జెండే ఏదో? ఇరు పార్టీలకు కీలకం


1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సి శ్యామలరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టి అక్కయ్యనాయుడిపై 10,909 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన టి వెంకటరత్నం ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జిఎస్‌ నాయుడిపై 22,569 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె రామ్మోహనరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మీసాల నీలకంఠం నాయుడిపై 32,297 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన టి సరస్వతమ్మ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మీసాల నీలకంఠం నాయుడిపై 11,032 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె బాబూరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె రామ్మోహనరావుపై 17,065 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


Also Read: కురుపాం గడ్డ ఎవరికి అడ్డాగా నిలుస్తుందో!


1999 ఎన్నికల్లో గద్దెబాబూరావు మరోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మీసాల నీలకంఠం నాయుడిపై 4651 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె బాబూరావుపై 11034ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె బాబూరావుపై 5942 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కిమిడి మృణాళిని ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణపై 20,842 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ మరోసారి ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల తేడాతో గెలుపొందారు. 


రెండు లక్షలకుపై ఓటర్లు


ఈ నియోజకవర్గంలో రెండు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2,29,228. వీరిలో పురుష ఓటర్లు 1,13,394 మంది కాగా, మహిళా ఓటర్లు 1,15,823 మంది ఉన్నారు. గడిచిన నాలుగు ఎన్నికలను ఇక్కడ పరిశీలిస్తే విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. మూడు ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి బొత్స రెండుసార్లు కాంగ్రెస్‌ హయాంలో, ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రిగా చేస్తున్నారు. టీడీపీ హయాంలో గెలుపొందిన మృణాళిని కూడా మూడేళ్లపాటు మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఇక్కడ బొత్స బరిలోకి దిగుతుండగా, మృణాళిని కుమారు నాగార్జున మరోసారి బొత్సను ఢీకొంటున్నారు.


Also Read: ఎస్‌ కోట ఎవరికి కోటగా మారుతుందో..!


Also Read: పాలకొండ ఎప్పుడూ కీలకమే - ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఏ జెండా ఎగిరేనో?